శివాజీ రాజా రిట‌ర్న్ గిప్ట్ ఇదేనా?

Last Updated on by

న‌టుడు, `మా` అసోసియేష‌న్ మాజీ అధ్య‌క్షుడు శివాజీ రాజా వైసీపీలో చేర‌బోతున్నాడా? ఇప్పటికే జ‌గ‌న్ అపాయింట్ మెంట్ తీసుకున్నారా? అంటే అవున‌నే స‌మాచారం అందుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన `మా` ఎన్నిక‌ల్లో న‌రేష్ పై శివాజీ రాజా ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్నిక‌ల వాతావ‌ర‌ణ నేప‌థ్యంలో ప‌లువురు సెల‌బ్రిటీలు రాజ‌కీయాల‌పై ఆస‌క్తి చూపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే అలీ, జ‌య‌సుధ‌, పృథ్వీ, పోసాని వైసీపీలో చేరారు. తాజాగా వారి బాట‌లోనే శివాజీ రాజా ఫ్యాన్ కింద‌కు చేర‌డానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నేడు ఎన్నిక‌ల ప్ర‌చారానికి బ్రేక్ ఇచ్చిన జ‌గ‌న్ లోట‌స్ పౌండ్ లో కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండ‌నున్నారు.

దీంతో శివాజీ రాజా ఆయ‌న్ని క‌లిసి పార్టీ కండువా క‌ప్పుకోనున్నార‌ని ఫిలిం న‌గ‌ర్ లో చ‌ర్చ సాగుతోంది. అయితే ఉన్న‌ట్టుండి శివాజీ తీసుకున్న నిర్ణ‌యం వెనుక కార‌ణాలు చాలానే వినిపిస్త‌న్నాయి. రెండు రోజుల క్రిత‌మే జ‌న‌సేన పార్టీ అధ్య‌క్ష‌డు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్ర‌ద‌ర్ నాగ‌బాబుకి రిట‌ర్న్ గిప్ట్ ఇస్తాన‌ని వ్యాఖ్యానించాడు. `మా ` ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒక‌సారి అధ్య‌క్షుడిగా చేసిన వారు రెండ‌వ‌సారి ఎలా చేస్తారంటూ ప్రశ్నించిన నేప‌థ్యంలో శివాజీ రాజా అలా స్పందించాడ‌ని! ఆ రిటర్న్ గిప్ట్ జ‌గ‌న్ రూపంలో జ‌న‌సేనాని బ్ర‌ద‌ర్ కి ఇవ్వ‌బోతున్నాడ‌ని అంటున్నారు. గ‌తంలో శివాజీరాజా మా ప‌ద‌విని అల‌క‌రించ‌డంలో మెగాస్టార్ చిరంజీవి కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే.


Related Posts