హీరోతో ఎఫైర్ మ‌రో ప్రూఫ్‌

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు జాతీయ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మం ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో అక్కినేని కుటుంబానికి సంబంధించిన వారంతా పిల్లా పాప‌ల‌తో స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా హాజ‌రై కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన వారిని ఆహ్వానించారు. 2018, 2019 సంవ‌త్స‌రాల‌కు గాను శ్రీ‌దేవి, రేఖ‌ల‌కు ఏఎన్నార్ జాతీయ పుర‌స్కారాల‌ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అంద‌జేశారు.

అయితే ఈ కార్య‌క్ర‌మంలో నాగార్జున మేన‌కోడ‌లు, సుమంత్ సోద‌రి సుప్రియ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఆమెకు తోడుగా యంగ్ హీరో క‌మ్ డైరెక్ట‌ర్ అడివి శేష్ కూడా క‌నిపించ‌డం ప్ర‌తీ ఒక్క‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. `గూఢ‌చారి` సినిమా నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రుగుతోందంటూ వార్త‌లు కుప్ప‌లు తెప్పలుగా పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్త‌ల్ని అడివి శేష్ సింపుల్‌గా కొట్టిపారేశారు. కానీ అవే వార్త‌ల్ని ఏఎన్నార్ అవార్డ్స్ ఫంక్ష‌న్‌లో సుప్రియ‌తో క‌లిసి నిజం చేయ‌డంతో మ‌ళ్లీ కొత్త కొత్త క‌థ‌నాలు పుట్టుకొస్తున్నాయి. ఇద్ద‌రు క‌లిసి పెళ్లికి రెడీ అవుతున్నార‌ని, అందుకే అడివి శేష్ నాగ్ ఫ్యామిలీకి ద‌గ్గ‌ర‌కావ‌డానికే ఈ ఫంక్ష‌న్‌లో పాల్గొన్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి దీనిపై అడివి శేష్ ఏమ‌ని బుకాయిస్తాడో చూడాలి.