ఎవరికి బ్యాండ్ పడుతుందో..!

ఆగస్టు 11 న మూడు పెద్ద సినిమాలు విడుదలౌతున్నాయి.  పెద్ద స్థాయి హీరోలు కాకపోయినా.. మొదటి నుంచి ఈ మూడు సినిమాలు నిత్యం వార్తల్లో ఉండటం.. ప్రచార చిత్రాలు కూడా అందుకు తగిన విధంగా సూపర్ గా ఉండటంతో ఈ మూడింటిపై హైప్ క్రియేట్ అయింది.  అందులో ఒకటి లై.  అ ఆ సినిమా తరువాత నితిన్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు పెరిగాయి.  పైగా ఇందులో నితిన్ గెటప్ వెరైటీగా ఉంది.  లై అంటే అబద్దం.  అబద్దాలు చెప్పి అమ్మాయిలను పడెయ్యచ్చు.. అనే పదాన్ని ప్రచార చిత్రంలో వాడారు.  దీనిని బట్టి చూస్తే.. ఈ సినిమా ఓ ప్రేమకథ అని తెలుస్తోంది. కానీ,  ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్స్ లో నితిన్ ఓ పెట్టె పట్టుకొని ఉంటాడు.  అసలు ఆ పెట్టెలో ఏముందో అని అందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక బాహుబలితో మంచి పేరు తెచ్చుకున్న రానా నటిస్తున్న నేనేరాజు నేనే మంత్రి కూడా ఆగష్టు 11 న విడుదల కాబోతుంది.
రాజకీయ ప్రాధాన్యత కలిగిన సినిమా.  చాలా కాలం తరువాత తేజ పెద్ద హీరోతో సినిమా చేస్తున్నాడు.  అయితే, యాంటీ క్లైమాక్స్ ఉందని.. ఇది సినిమాకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో అని భయపడుతున్నారు.  ఎందుకంటే.. పోస్టర్స్ లో రానా ఉరి ముందు నిలబడి ఉంటాడు.  పైగా ఇందులో రానా క్లైమాక్స్  లో మరణిస్తాడని అంటున్నారు. ఇక ముచ్చటగా మూడోది బోయపాటి చిత్రం.  బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వస్తున్న మాస్ మజాకా జయ జానకి నాయక.  టైటిల్ వెరైటీగా ఉంది.  చాల సాఫ్ట్ గా ఉంది.  కానీ, సినిమా మాత్రం ఖచ్చితంగా మాస్ గానే ఉంటుంది.  ఎందుకంటే.. బోయపాటి పంథా ఎలాంటిదో అందరికి తెలిసిందే కదా.  బోయపాటి చిత్రాలు ఎలా ఉంటాయో కూడా తెలుసు.  అయితే సూపర్ హిట్ లేదంటే అట్టర్ ప్లాప్  మరి ఈ మూడు చిత్రాల్లో ఏ సినిమాకు నెగెటివ్ టాక్ వస్తోందో.. ఏ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందో తెలియాలంటే శుక్రవారం వరకు వెయిట్ చేయక తప్పదు.