ముగ్గురు హీరోయిన్లతో ఎన్టీఆర్ 30

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో రెండో చిత్రానికి రంగం సిద్ధమైంది. సాయంత్రం ఐదు గంటలకి ఆ సినిమాని ప్రకటించబోతున్నారు. విజయవంతమైన అరవిందసమేత తర్వాత ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీయనున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తి కరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇదొక కుటుంబ కథతో రూపొందనున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ముగ్గురు కథానాయికలు నటించబోతున్నట్లు సమాచారం. ఇదివరకు త్రివిక్రమ్ ఎన్టీఆర్ చేసిన అరవింద సమేత ఫ్యాక్షన్ నేపథ్యంలో యాక్షన్ ప్రధానంగా తెరకెక్కింది. ఈసారి అందుకు భిన్నంగా ఉండాలనేది ఆ ఇద్దరి ఆలోచన. అందులో భాగంగానే కుటుంబ కథ సిద్ధమైనట్టు తెలిసింది. ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ పూర్తవగానే ఈ కొత్త సినిమా మొదలు కానున్నట్టు సమాచారం. హారిక హాసిని సంస్థలోనే ఈ సినిమా తెరకెక్కుతోంది.