ఒకేసారి మూడు సెట్లతో స‌రిలేరు

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు` షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే క‌శ్మీర్ లో కీల‌క షెడ్యూల్ పూర్తి చేసారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ కు సంబ‌ధించిన ఏర్పాటు సాగుతున్నాయి.తదుపరి షెడ్యూల్ ని ఈ నెల 26 నుంచి హైదరాబాద్ లో ఆరంభించడానికి రెడీ అవుతున్నారు. తాజాగా సినిమా కోసం ఓ భారీ సెట్స్ నిర్మిస్తున్నట్లు వెలుగులోకి వ‌చ్చింది. హైద‌రాబాద్ లోనే క‌ర్నూలు కొండారెడ్డి బురుజును పోలిన సెట్స్ ను రామోజీఫిలిం సిటీలో నిర్మిస్తున్నారు.

వాస్త‌వానికి ముందుగా రియ‌ల్ స్పాట్ లోనే షూటింగ్ చేయాల‌నుకున్నారుట‌. కానీ అక్క‌డి వ‌ర‌కూ వెళ్ల‌డం స‌మ‌యం వృద్ధాతో పాటు, ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని చివ‌రి నిమిషంలో భావించి హైద‌రాబాద్ లోనే సెట్ వేస్తున్న‌ట్లు చెబుతున్నారు. అందువ‌ల్ల సెట్ నిర్మాణం ప‌నులు ఆల‌స్యంగా జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. ఈ సెట్ 4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారుట‌. దీంతో పాటు ట్రైన్ సెట్, విజయశాంతి ఇల్లు సెట్ సెట్స్ కూడా అక్క‌డే వేస్తున్నారట. ఈ మొత్తం సెట్స్ అన్నింటికి క‌లిపి భారీగానే ఖ‌ర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : Mahesh Along With Family In Kashmir