7000 స్క్రీన్లలో థ‌గ్స్ ఎటాక్‌

Last Updated on by

2018 ద్వితీయార్థంలో మోస్ట్ అవైటెడ్ సినిమాగా రిలీజ‌వుతోంది `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌`. అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చ‌న్, క‌త్రిన‌, పాతిమా స‌నా షేక్ వంటి స్టార్లు న‌టించిన ఈ సినిమా పోస్ట‌ర్లు, టీజ‌ర్లు, ట్రైల‌ర్ అన్నీ జ‌నాల‌కు పిచ్చిగా న‌చ్చేశాయి. ముందే ప్ర‌క‌టించిన‌ట్టే నేడు ఈ సినిమా ప్రపంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజైంది. ఈ సినిమాని య‌శ్‌రాజ్ ఫిలింస్ సంస్థ వ‌ర‌ల్డ్ వైడ్‌ 7000 స్క్రీన్ల‌లో రిలీజ్ చేసిందని త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు.

కేవ‌లం ఇండియాలోనే 5000 స్క్రీన్ల‌(హిందీ, త‌మిళ్‌, తెలుగు)లో రిలీజ్ చేయ‌గా, ఓవ‌ర్సీస్‌లో మ‌రో 2000 స్క్రీన్ల‌లో రిలీజ్ చేశార‌ని వెల్ల‌డించారు. మొత్తానికి ఈ సినిమా ఇదివ‌ర‌కూ ఉన్న అన్ని రికార్డుల్ని బ్రేక్ చేసే ఛాన్సు ఉందా లేదా? అన్న‌ది మ‌రి కాసేప‌ట్లో రివ్యూల రూపంలో తేల‌నుంది. ఈ చిత్రంలో థ‌గ్స్ ని లీడ్ చేసేవాడిగా అమితాబ్ న‌ట‌న హైలైట్‌గా ఉండ‌నుంది. సుర‌య పాత్ర‌లో క‌త్రిన నాట్యాలు మ‌త్తెక్కించ‌నున్నాయ‌ని యూత్ అంచ‌నా వేస్తున్నారు. పాతిమా సాహ‌స‌నారిగా క‌నిపించ‌నుంది. అమీర్ ఖాన్ ఫిరంగి పాత్ర అంతే స్పెష‌ల్ అని రివీలైన విజువ‌ల్స్ చెబుతున్నాయి.

User Comments