అంధుడి ఎట‌ర్న‌ల్ ప్రేమ‌క‌థ‌తో

Last Updated on by

అన్న పూర్ణేశ్వరి సినీ క్రియేషన్స్ పతాకంపై శ్రీ ఉషోదయ క్రియేషన్స్ సహకారంతో సంచారి విజయ్ కుమార్, మేఘాశ్రీ హీరో హీరోయినులుగా , S.A.R. ద‌ర్శ‌క‌త్వంలో యం.నారాయణ స్వామి, శ్రీమతి నాగ లక్ష్మి నిర్మాతలుగా, డాక్టర్ మహేంద్ర సహ నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం `తులసి కృష్ణ`. కన్నడ భాష‌లో రిలీజ్ అయి అఖండ విజయం సాధించిన `కృష్ణ తులసి చిత్రానికి ఇది అనువాద రూపం .ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుక‌ నిర్మాతల మండలి హాలులో సినీ పెద్ద‌లు తమ్మారెడ్డి భరద్వాజ . డైరెక్టర్ సాగర్ , మోహన్ గౌడ్ , సాయి వెంకట్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ గారు ఆడియో సీడీని లాంచ్ చేసి మొదటి సీడీని డైరెక్టర్ సాగర్ గారికి అందజేశారు.

ఈ సందర్బంగా అయన మాట్లడుతూ హృదయాన్ని కదలింప చేసే ఇలాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు. లవ్ అట్ ఫస్ట్ సైట్ అనుకొనే ఈ రోజుల్లో అందుడైన హీరో మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుందో డైరెక్టర్ అద్భుతంగా హ్యాండిల్ చేసాడని కొనియాడాడు. డైరెక్టర్ సాగర్ గారు మాట్లాడుతూ, ` కనులతో ప్రేమించే ప్రేమ కన్నా మనసుతో ప్రేమించే ప్రేమే గొప్పదని అభివర్ణించారు. సాయి వెంకట్ మాట్లాడుతూ, ` చిత్రం లోని ప్రతి సన్నీవేశం అద్భుతంగా ఉందని కొనియాడారు. మోహన్ గౌడ్ మాట్లాడుతూ, ` సినిమా లోని అన్ని సాంగ్స్ మనసుకు హత్తు కునేలా ఉన్నాయని ప్రశంసించారు. డైరెక్టర్ S.A.R. మాట్లాడుతూ కథా బలమున్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని , కన్నడ కన్నా తెలుగులో ఈ సినిమా గొప్ప విజయం సాదిస్తుందని నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేసారు.కో ప్రొడ్యూసర్ డాక్టర్ మహేంద్ర మాట్లాడుతూ , ` మా ఆహ్వానాన్ని మన్నించి మమ్మిలి దీవించడానికి వచ్చిన పెద్ద లందరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపు తున్నానని, ఒక మంచి సినిమాను తెలుగు వారికీ అందించాలని ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

User Comments