బాలీవుడ్ హీరోలకు తెలుగు పిచ్చి చాలా ఎక్కువ

ఏ ఇండ‌స్ట్రీ చూసినా ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం అన్న‌ట్లుంది ఇప్పుడు ప‌రిస్థితి. ఒక్క‌రు ఇద్ద‌రు కాదు.. అంతా కాపీ రాయుళ్లే త‌యారైపోయారు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో. అరే.. ఎక్క‌డ చూసినా కూడా కాపీ రాయుళ్లే ద‌ర్శ‌న‌మిస్తున్నారు. పేరుకు ఇన్స్ స్పిరేష‌న్ అంటారు.. సినిమా అంతా ఎత్తిపోత‌ల ప‌థ‌కం కింద ఎత్తేస్తుంటారు. బాలీవుడ్ లో అయితే ఈ క‌ల్చ‌ర్ మ‌రీ ఎక్కువైపోయింది. అక్క‌డి ద‌ర్శ‌కులు క‌థ‌లు రాయ‌డం మానేసి.. తెలుగు సినిమా డీవీడీలు కొనేసి ఇంట్లో పెట్టుకుంటున్న‌ట్లున్నారు. తాజాగా విడుద‌లైన భాగీ 2 ట్రైల‌ర్ చూస్తే ఇదే అర్థ‌మ‌వుతుంది. ఈ సినిమా క్ష‌ణం సినిమాకు కాపీ. దాన్ని ద‌ర్శ‌కుడు యాక్ష‌న్ తో క‌వ‌ర్ చేసాడు.

ట్రైల‌ర్ లోనే క‌థ మొత్తం రివీల్ చేసేస‌రికి.. ఈ సినిమా క్ష‌ణం అని తేలిపోయింది. టైగ‌ర్ ష్రాఫ్ ఉన్నాడు కాబ‌ట్టి ఇదే క‌థ‌కు యాక్ష‌న్ ట‌చ్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు అహ్మ‌ద్ ఖాన్. ఇక రియ‌ల్ లైఫ్ ల‌వ‌ర్ దిశాప‌టానీతో క‌లిసి న‌టించాడు ఇందులో టైగ‌ర్ ష్రాఫ్. ఈయ‌న‌కు మ‌న తెలుగు సినిమాలు బాగానే అచ్చొచ్చాయి. గ‌తంలో కూడా ఈయ‌న న‌టించిన హీరోపంటి తెలుగు సినిమా ప‌రుగుకు ఫ్రీమేక్. చెప్ప‌కుండా కొట్టేసిన క‌థే ఇది కూడా. ఈ సినిమాతోనే ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు టైగ‌ర్ ష్రాఫ్. ఇక గ‌తేడాది వ‌చ్చిన రాబ్తా కూడా మ‌గ‌ధీర‌కు కాపీ. మ‌న మగ‌ధీర చ‌రిత్ర సృష్టిస్తే.. రాబ్తా దాన్ని గంగ‌లో క‌లిపేసింది. ఇలా బాలీవుడ్ లో ఇప్పుడు మ‌న క‌థ‌ల‌ను మ‌న‌కు తెలియ‌కుండా దోచేస్తూ.. ఎత్తిపోథ‌ల ప‌థ‌కం పెట్టారు ద‌ర్శ‌కులు.

క్షణం మూవీ ట్రైలర్ చూసి మీరే డిసైడ్ అవ్వండి భాగీ 2 కాపీనా కాదా..?

User Comments