ఏడు వ‌చ్చాయి.. హిట్టు బొమ్మెక్క‌డ‌

2019 First Half Tollywood Review

శుక్ర‌వారం వ‌చ్చిందంటే తెలుగు సినిమాల రిలీజ్ సంద‌డే సంద‌డి. అదీ స్టార్ హీరోల సినిమాలు పోటీ లేక‌పోతే చిన్న సినిమాలు పోటీ ప‌డి మ‌రీ రిలీజ్ అవుతుంటాయి. అలా ఈ శుక్రవారం దాదాపు 11 రిలీజ్ చేయాల‌నుకున్నా ఏడింటిని మాత్రం రిలీజ్ చేశార‌ట‌. కానీ చెప్ప‌పుకోద‌గ్గ సినిమాలేవి లేవ‌ని తొలి షోతోనే తేలిపోయింది. కాస్తో కూస్తో కె.ఎస్ రామారావు నిర్మించిన కౌస‌ల్య కృష్ణ మూర్తి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. వీట‌న్నింటిలో పెద్ద సినిమా కూడా ఇదే. ఇక మిగ‌తా సినిమాల‌న్ని బిలో యావ‌రేజ్ గా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌డ‌టం క‌ష్ట‌మ‌ని నిపుణులు తేల్చేసారు. ఆ సినిమాల‌కు రివ్యూలు కూడా ఏమంత పాజిటివ్ గా లేవు.

అశ్వ‌మేథం, నివాసి, ఉండిపోరాదే, పండుగాడి ఫోటో స్టూడియో, ఏదైనా జ‌ర‌గొచ్చు, బోయ్, కేడీ నెం1, జిందా గ్యాంగ్, నీతోనే హాయ్ హాయ్, హ‌వా, కౌస‌ల్య కృష్ణ‌మూర్తి ఇలా కొన్ని సినిమాలో రిలీజ్ అయ్యాయి. వీటిలో క్రికెట్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన కౌస‌ల్య కృష్ణ మూర్తికే కాస్త పాజ‌టివ్ టాక్ ఉంది. మిగిలిన  సినిమాల‌కు క‌నీసం ప్ర‌మోష‌న్ కూడా లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కుడికి తెలియ‌ని ప‌రిస్థితి.