`కంగారూ`ల న‌ట్టింట తెలుగోడా?

Last Updated on by

తెలుగు సినిమా ప‌రిధి పెరుగుతోంది. బాక్సాఫీస్ విస్త్ర‌తి అంత‌కంత‌కు రెట్టింప‌వుతోంది. ఊహించ‌ని రీతిలో అసాధార‌ణ క‌లెక్ష‌న్స్‌తో మ‌న సినిమా కొత్త ఆశ‌ల్ని పెంచుతోంది. `బాహుబ‌లి` తెచ్చిన మానియా టాలీవుడ్ భ‌విత‌వ్యాన్నే అమాంతం మార్చేస్తోంది. మ‌న తెలుగు సినిమాని ప్ర‌పంచ దేశాలు ప‌రిశీలించే స్థాయిని అందుకున్నాం. ఇక‌మీదట ఇండియ‌న్ డ‌యాస్పోరా (మ‌నోళ్లు) ఉన్న అన్ని దేశాల్లోనూ తెలుగు సినిమా బంప‌ర్ హిట్ కొట్ట‌డం ఖాయం అన్న సిగ్న‌ల్స్ అందుతున్నాయి. ఎన్నారైల డాల‌ర్ల సాక్షిగా ఇది ప‌క్కా నిజం!

అమెరికా, బ్రిట‌న్‌, మలేషియా, జ‌పాన్‌, కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ .. దేశం ఏదైనా అక్క‌డ మ‌న తెలుగు వాళ్లు, ఇండియ‌న్లు ఉంటే చాలు మ‌న తెలుగు సినిమా బంప‌ర్ హిట్ కొట్టేయ‌డం ఖాయం. ఇదే మాట‌ను కాస్త స్టైలిష్‌గా త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ఇలా చెప్పారు. “న‌వ్‌.. ఇదే బిగ్ న్యూస్‌… టెర్రిఫిక్ స‌ర్‌ప్రైజ్‌.. తెలుగు సినిమాలు ఆస్ట్రేలియాలో గేమ్ ఛేంజ్ చేశాయి. ఇక్క‌డ‌ హిందీ, పంజాబీ సినిమాల డామినేష‌న్ ఉంటుంది. ఇలాంటి చోట‌ రెండు తెలుగు సినిమాలు బాక్సాఫీస్‌ని ఒణికించాయి. అందులో ఒక‌టి -రంగ‌స్థ‌లం, రెండోది -భ‌ర‌త్ అనే నేను..నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో తెలుగు సినిమా బిగ్ గేమ్ ఛేంజ‌ర్స్ ఇవే“ అని ట్వీట్ చేశారు. కంగారూల దేశంలో తెలుగు సినిమా ఘ‌న‌త‌పై త‌ర‌ణ్ ప్ర‌శంస మ‌రింత ఉత్సాహం పెంచ‌నుంది. రాబోవు రోజుల్లో మ‌రిన్ని చిత్రాలు ఆస్ట్రేలియాలో భారీగా రిలీజ‌వుతాయ‌న‌డంలో సందేహం లేదు. తొలిగా బ‌న్ని `నా పేరు సూర్య‌` క్యూలో ఉంది.

User Comments