ఓటేసిన టాలీవుడ్ సెల‌బ్స్

తెలంగాణ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా సాగుతున్నాయి. పోలింగ్ ఎలాంటి ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం లేకుండా ప్ర‌శాంతంగానే సాగుతోంది. ఈ ఎన్నిక‌ల్లో సెల‌బ్రిటీలు పెద్ద ఎత్తున ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఓటేయండి అని ప్ర‌జ‌ల‌కు చెప్ప‌డమే కాదు.. ఓటు వేసి చూపించారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కొణిదెల‌, శ్రీ‌జ, అక్కినేని నాగార్జున‌- అమ‌ల‌, నితిన్, ఎన్టీఆర్ -ప్ర‌ణ‌తి, కళ్యాణ్ రామ్, అల్లు అర్జున్, అర‌వింద్ త‌దిత‌రులు ఓటు వేసారు. అలాగే ఆర్‌.ఆర్‌.ఆర్ టీమ్‌కి సెల‌విచ్చిన రాజమౌళి టీమ్ స‌భ్యులంద‌రినీ ఓటేయ‌మ‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి కూడా ఓటేశారు. ఇక‌పోతే మంచు కుటుంబం నుంచి ల‌క్ష్మీ ప్ర‌స‌న్న ఓటును స‌ద్వినియోగం చేసుకున్నారు. యంగ్ య‌మ ఎన్టీఆర్ కూకట్‌ప‌ల్లిలో పోటీ చేస్తున్న‌ త‌న సోద‌రి సుహాసిని ఓటేశారు. త‌న‌కు గెలుపును ప్ర‌సాదించాల‌ని ఇప్ప‌టికి సామాజిక మాధ్య‌మాల్లో కోరారు.

ఓటు వేసిన అనంత‌రం ఎన్టీఆర్ మాట్లాడుతూ – “ఓటు మన బాధ్యత అని.. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. రాజ్యాంగం – దేశం మనకు కల్పించిన హక్కు ఇది. ఆ హక్కును నెరవేర్చాలి. ఓటేయకపోతే సమస్యలపై ఫిర్యాదు చేసే హక్కును కోల్పోతాం. ఓటు వేయాలని ఒకరు చెప్తే వచ్చేది కాదని.. మనసా  వాచా కర్మణా మనకు అనిపించాల“ అని తార‌క్ అన్నారు.