మెగా భ‌జ‌న మ‌రీ ఎక్కువైంది రాజా..!

Last Updated on by

తెలుగు ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీ రేంజ్ ఏంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అక్క‌డ్నుంచి ప‌ది మంది హీరోలు ఉంటే.. అందులో అర‌డ‌జ‌న్ మందికి క్రేజ్ ఉంది.. ముగ్గురికి ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసే స‌త్తా ఉంది.. ఒక్క‌రైతే 25 ఏళ్ల‌పాటు తెలుగు ఇండ‌స్ట్రీని నెంబ‌ర్ వ‌న్ గా ఏలిన చ‌రిత్ర ఉంది. ఇప్ప‌టికీ ఆయ‌నే నెం.1 గా ఉన్నారు కూడా..! ఆయ‌నే మెగాస్టార్ చిరంజీవి.. చ‌రిత్ర తిర‌గ‌రాసే హీరోలు ప‌వ‌న్, రామ్ చ‌ర‌ణ్.. క్రేజ్ ఉన్న హీరోలు బ‌న్నీ, వ‌రుణ్ తేజ్, సాయిధ‌రంతేజ్. ఇంత చ‌రిత్ర ఉన్న హీరోల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవాలంటే భ‌జ‌న చేయ‌క త‌ప్ప‌దు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇదే జ‌రుగుతుంది. ఏకంగా ఒకే కుటుంబంలో అంత‌మంది హీరోలు ఉంటే.. ఇప్పుడు భ‌జ‌న చేయ‌క ఇంకేం చేస్తారు ద‌ర్శ‌కులు. కానీ త‌మ స్థాయిని కూడా మ‌రిచిపోయి భ‌జ‌న చేయ‌డ‌మే మంచిది కాదంటున్నారు కొంద‌రు.

హ‌రీష్ శంక‌ర్.. వ‌క్కంతం వంశీ.. మారుతి.. ఇలా ఒక్క‌రు ఇద్ద‌రు కాదు.. అంతా ఇప్పుడు మెగా భ‌జ‌న బ్యాచ్ లా మారిపోయింది. త్రివిక్ర‌మ్ కూడా ఈ లిస్ట్ లోనే ఉన్నాడు. కానీ ఆయ‌న అంద‌రికీ చేయ‌డు.. కేవ‌లం ఆ ఆఫ‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మాత్ర‌మే ఇచ్చాడు. ఎందుకంటే స్నేహితుడు క‌దా..! ఇక ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ అయితే ప‌వ‌న్, బ‌న్నీ, చ‌ర‌ణ్ తేడా లేకుండా ఎప్పుడూ భ‌జ‌న చేస్తూనే ఉంటాడు. ఛాన్స్ దొరికితే మున‌గ‌చెట్టు కాదు.. ఏకంగా ఎవ‌రెస్ట్ ఎక్కించేస్తాడు. ప‌వ‌న్ ను అయితే అంత‌కంటే ఓ మెట్టు పైనే ఉంచేస్తాడు. త‌ను క్రేజీ డైరెక్ట‌ర్ అనే విష‌యాన్ని కూడా ప‌క్క‌న బెట్టేసి.. మెగా భ‌జ‌న్ రాయుడిగా మారిపోయాడు ఈయ‌న‌. ఇక మారుతి కూడా అంతే. ఎప్పుడెప్పుడు బ‌న్నీ ఛాన్స్ ఇస్తాడా అని వేచి చూస్తున్నాడీయ‌న‌. అందుకే ఎప్పుడూ మెగా కుటుంబానికి కంచెలా ఉంటాడు.

వ‌క్కంతం వంశీ చేసిందే ఒక్క సినిమా.. అది కూడా ప్లాప్. నా పేరు సూర్య త‌ర్వాత మెగా కుటుంబాన్ని తెగ పొగిడేస్తున్నాడు వంశీ. మొన్న నా పేరు సూర్య ప్రీ రిలీజ్ వేడుక‌లో రామ్ చ‌ర‌ణ్ ను.. ఈ మ‌ధ్యే జ‌రిగిన థ్యాంక్స్ మీట్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను పొగిడి పొగిడి చంపేసాడు వంశీ. ఏదో అవ‌కాశాల కోసం చిన్న ద‌ర్శ‌కులు ఇలా భ‌జ‌న చేసారంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ త‌మ‌కంటూ ఓ స్థాయిని తెచ్చుకుని.. క‌ష్ట‌ప‌డి ఎదిగి స్టార్ డైరెక్ట‌ర్ లుగా మారిన త‌ర్వాత కూడా మెగా భ‌జ‌న చేయాల్సిన అవ‌స‌రం ఏంటో అర్థం కావ‌ట్లేదు కొంద‌రికి. రాజ‌మౌళి, వినాయ‌క్ లాంటి వాళ్ల‌ను తీసుకోండి.. వాళ్లు అంద‌రితోనూ బాగానే ఉంటారు. కానీ ఎప్పుడూ ఎవ‌రి భ‌జ‌న చేయ‌రు. వినాయ‌క్ కు ఫ్లాపులు వ‌చ్చినా కూడా సింపుల్ గానే ఉంటాడు. రాజ‌మౌళి సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. వాళ్ల‌లా మిగిలిన వాళ్లు ఎందుకు ఉండ‌లేక‌పోతున్నారు..? భ‌జ‌న ఆగ‌దా..? మెగా కుటుంబం తెలిసి కూడా ఎందుకు ఈ భ‌జ‌న‌ను ప్రోత్స‌హిస్తున్నారు..? అయినా త‌ప్పు వాళ్ల‌ది కాదులెండి.. పిలిచి పొగ‌డ్తామంటే ఎవ‌రు మాత్రం కాదంటారు.

User Comments