బడా నిర్మాత ఓ హీరోకు పారితోషికం ఇవ్వట్లేదట..!

Last Updated on by

ఇండ‌స్ట్రీలో ఏ స‌పోర్ట్ లేకుండా ఎద‌గ‌డం చాలా క‌ష్టం. ఒక‌వేళ వ‌చ్చినా కొన్ని హిట్లు కొట్టినా.. ఆ త‌ర్వాత నిల‌బ‌డ‌టం కూడా క‌ష్టమే. ఇప్పుడు ఓ కుర్ర హీరో విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. అప్ప‌ట్లో ఉద‌య్ కిర‌ణ్ మాదిరి.. ఈ హీరో కూడా హ్యాట్రిక్ విజ‌యాల‌తో ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు. 10 కోట్ల‌కు పైగానే మార్కెట్ సంపాదించుకున్నాడు. అన్నీ బాగానే ఉన్న టైమ్ లో వ‌ర‌స ప్లాపులు వ‌చ్చాయి ఈ హీరోకు. అయినా మ‌ధ్య‌లో ఒక‌ట్రెండు యావ‌రేజ్ లు ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ కుర్ర హీరోను నిర్మాత‌లు కావాల‌నే టార్గెట్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఈ మ‌ధ్యే ఈయ‌న న‌టించిన ఓ సినిమా రిలీజ్ అయి.. వ‌చ్చి వెళ్లిన‌ట్లు కూడా తెలియ‌లేదు. దాంతో ఇప్పుడు అత‌డితో సినిమాలు క‌మిటైన నిర్మాత‌లు ఇచ్చిన అడ్వాన్సులు వెన‌క్కి ఇవ్వాలంటూ గోల పెడుతున్నార‌ని తెలుస్తుంది.

పైగా సినిమాకు కోటి రూపాయ‌లు తీసుకునే ఆ కుర్రాడికి ఇప్పుడు 30 ల‌క్ష‌లు కూడా ఇవ్వ‌డం లేద‌నే టాక్ బానే వినిపిస్తుంది. ఇండ‌స్ట్రీలో వ‌ర‌స విజ‌యాలతో జోరు మీదున్న ఓ నిర్మాత అయితే ఈ కుర్ర హీరోతో సినిమా చేస్తూ క‌నీసం ఇప్ప‌టి వ‌ర‌కు పారితోషికం కూడా ఇవ్వ‌లేద‌ని తెలుస్తుంది. సినిమా విడుద‌లైన త‌ర్వాతే ఈయ‌న‌కు డ‌బ్బు ముట్టేది అనే వార్త‌లు వస్తున్నాయి. గ‌తంలో ఇదే నిర్మాత ర‌వితేజతో కూడా ఇలాంటి గేమ్స్ ఆడాడు. ఇప్పుడు ఈ కుర్ర హీరోను టార్గెట్ చేసాడు. ఇప్ప‌టికిప్పుడు హిట్ కొడితే త‌ప్ప ఆ హీరోకు ఇండ‌స్ట్రీలో నూక‌లు లేన‌ట్లే. ఏదైనా తేడా జ‌రిగితే మాత్రం అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు అంటూ క‌థ‌లు చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది.

User Comments