సోకుల కోసం కష్టపడుతున్న తెలుగు హీరోయిన్స్

Last Updated on by

హీరోయిన్ అంటే స‌న్న‌గా మెరుపుతీగ‌లా ఉండాల‌నేది ఒక‌ప్ప‌టి రూల్. ఇప్పుడు ఎలా ఉన్నా కూడా టాలెంట్ ఉంటే ఆద‌రిస్తున్నారు ప్రేక్ష‌కులు. నిత్యామీన‌న్, కాజ‌ల్ ఇలా చాలా మంది బొద్దుగానే ఉంటారు. వాళ్లంద‌రూ స్టార్స్ అయ్యారు. కానీ కొంద‌రు మాత్రం కావాల‌నే స‌న్న‌బ‌డుతున్నారు. ఇది వ‌ర‌కు లావుగా క‌నిపించిన ముద్దుగుమ్మ‌లు కూడా ఇప్పుడు మెరుపుతీగ‌ల్లా మారిపోతున్నారు. క‌డుపు కాల్చుకుని.. జిమ్ లో చెమ‌ట‌లు చిందించి మ‌రీ కొత్త లుక్ లోకి మారిపోతున్నారు. వీళ్ల‌లో ముందుగా చెప్పుకోవాల్సిన బ్యూటీ ర‌కుల్. తెలుగులో ఉన్న‌న్నాళ్లూ కాస్త బొద్దుగానే క‌నిపించిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ కు వెళ్లిందో లేదో జీరోసైజ్ లోకి మారిపోయింది. ఇప్పుడు అయ్యారీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా క‌నిపిస్తున్న ర‌కుల్ ని చూసి తెలుగు ప్రేక్ష‌కులు షాక్ అవుతున్నారు. చూస్తుంటే అక్క‌డే సెటిల్ అయిపోయేలా క‌నిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

Tollywood Heroines Fitness Motivation for Size Zero

ఇక అంజలి కూడా స‌న్న‌గా మారిపోయింది. ఒక‌ప్పుడు బొద్దుగా క‌నిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు చాలా స‌న్న‌గా మారిపోయింది. అస‌లు చూడం గానే ఈమె మ‌నం చూసిన సీత‌మ్మేనా అనే అనుమానం రాక మాన‌దు. అంత‌గా మారిపోయింది ఈ భామ‌. తాజాగా ఈమె ఫోటోషూట్ ఒక‌టి రిలీజ్ అయింది. అందులో అంజ‌లిని చూసి గుర్తు ప‌ట్ట‌డం కూడా క‌ష్ట‌మే. ఇక మేఘాఆకాశ్ సైతం చాలా స‌న్న‌గా మారిపోయింది. లై సినిమాలో బొద్దుగా ముద్దుగా అందాలు ఆర‌బోసిన ఈ భామ‌.. ఇప్పుడు ఛ‌ల్ మోహ‌న్ రంగాలో మాత్రం స‌న్న‌గా మారిపోయింది. ఈమెతో పాటు రాశీఖ‌న్నా అయితే స‌గానికి స‌గం త‌గ్గిపోయింది. జై ల‌వ‌కుశ వ‌ర‌కు కూడా బొద్దుగా క‌నిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తొలిప్రేమ‌లో పూర్తిగా స‌న్న‌బ‌డింది. కారెక్టర్ కోసం కాదు.. త‌న కోస‌మే సన్న‌బ‌డ్డాన‌ని చెబుతుంది ఈ భామ‌. మొత్తానికి మ‌న చ‌క్క‌నమ్మ‌లంతా ఇలా చిక్కి స‌గ‌మైపోతున్నారు.

User Comments