వెన్నెల మాయ‌లో టాలీవుడ్ బందీ

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో నంబ‌ర్ వ‌న్ క‌మెడియ‌న్ ఎవ‌రు? అంటే సరైన ఆన్స‌ర్ ఇవ్వ‌లేని ప‌రిస్థితి ఉందిప్పుడు. ఎంద‌రో దిగ్గ‌జాలు కాలం చేశారు. బ్ర‌హ్మానందం, సునీల్, వేణుమాధ‌వ్ లాంటి టాప్ క‌మెడియ‌న్లు పూర్తిగా ఉనికిని కోల్పోయారు. సునీల్, శ్రీ‌నివాస్ రెడ్డి లాంటి స్టార్లు హీరోల‌య్యారు. ష‌క‌ల‌క శంక‌ర్, స‌ప్త‌గిరి ఇత‌ర‌త్రా జ‌బ‌ర్ధ‌స్త్ గ్యాంగ్ సైతం హీరోలుగా మార‌డంతో వీళ్లంతా ఇప్పుడు క‌మెడియ‌న్లుగా న‌టించ‌లేని స‌న్నివేశం నెల‌కొంది. ఒక‌సారి క‌మెడియ‌న్ హీరో అయితే పిలిచి అవ‌కాశం ఇచ్చేందుకు యువ‌ద‌ర్శ‌కుల‌కు జంకే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల దృష్ట్యా ఇప్పుడున్న క‌మెడియ‌న్ల‌లో నంబ‌ర్ వ‌న్ క‌మెడియ‌న్ ఎవ‌రు? అంటే ఒక వెన్నెల కిషోర్ పేరు మాత్ర‌మే వినిపిస్తోంది. భారీ బ‌డ్జెట్ సినిమాల‌తో పాటు మీడియం రేంజ్ సినిమాల్లోనూ న‌టిస్తూ నిరంత‌రం ఏదో ఒక ర‌కంగా త‌న స్థానాన్ని కాపాడుకుంటున్నాడు. ఇటీవ‌లే రిలీజైన సాహో, మ‌న్మ‌ధుడు 2 చిత్రాల్లోనూ బ్ర‌హ్మానందం ఆస‌క్తిక‌ర పాత్ర‌ల్లో నటించారు. తొలి నుంచి బ్ర‌హ్మానందం స్ఫూర్తితో ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చాన‌ని చెబుతున్న వెన్నెల ఇప్పుడు గురువు స్థానాన్ని కొట్టేశాడ‌ని చెప్పొచ్చు. ఇక‌పోతే టాలీవుడ్ లో ఒక గొప్ప స్థానంలో ఉండే బ్ర‌హ్మీ ఎందుకని సినిమాలు త‌గ్గించారు? అంటే … ఆయ‌న చెప్పిన కార‌ణం ఆస‌క్తిక‌రం ఇప్పుడు కూడా ఆ కుళ్లు కామెడీలు ఏం చేస్తాం? చేసిన పాత్ర‌ల్నే తిరిగి తెస్తున్నారు.. అందుక‌నే న‌టించ‌లేను అని చెబుతున్నారు బ్ర‌హ్మానందం. నిజ‌మే కామెడీలో కొత్త‌గా క్రియేట్ చేసేదేం ఉంది. పాత వాటినే తిరిగి తిప్పి చూపిస్తున్నారు మ‌న ద‌ర్శ‌కులు. అందువ‌ల్లనే కోట‌, బ్ర‌హ్మీ లాంటి సీనియ‌ర్లు ఏది ప‌డితే అది అంగీక‌రించ‌డం లేదు. మ‌రోవైపు ఇలాంటి సీనియ‌ర్ల‌తో ఏ ఈగో స‌మ‌స్య వ‌స్తుందోన‌ని యువ‌త‌రం ద‌ర్శ‌కులు భ‌య‌ప‌డి అవ‌కాశాలివ్వ‌డం లేద‌న్న‌ది న‌గ్న‌స‌త్యం.