స్టార్స్ మెచ్చిన హీరోయిన్ నంబర్ వన్

Last Updated on by

ఒక్కోసారి అంతే.. ల‌క్ లాగిపెట్టి తంతూ ఉంటుంది. వ‌ద్ద‌న్నా అవ‌కాశాలు వ‌స్తుంటాయి.. చాల‌నుకున్నా పాపులారిటీ వ‌స్తుంటుంది. ఇప్పుడు పూజా హెగ్డే విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. ఈ భామ‌కు అదృష్టం ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఎంత‌లా అంటే స్టార్ హీరోలే పిలిచి మ‌రీ ఈ భామ‌కు వ‌ర‌స‌గా ఆఫ‌ర్లు ఇస్తున్నారు. ఇప్ప‌టికే ఎన్టీఆర్.. ప్ర‌భాస్.. మ‌హేష్ లాంటి సూప‌ర్ స్టార్స్ తో న‌టిస్తుంది పూజా. ఇక ఇప్పుడు మ‌రో అదృష్టం కూడా ఈ భామ చెంత చేరింది. మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ లిస్ట్ లో పూజాహెగ్డే టాప్ ప్లేస్ లో నిలిచి అంద‌రికీ షాకిచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు టాప్ హీరోయిన్లుగా ఫీల్ అవుతున్న వాళ్లంద‌రికీ దిమ్మ‌తిరిగే షాకిచ్చింది పూజా.

గ‌తేడాది క‌నీసం లిస్ట్ లో కూడా క‌నిపించ‌ని పూజాహెగ్డే.. ఒక్క ఏడాది తిరిగేస‌రికి ఏకంగా నెంబ‌ర్ వ‌న్ అయిపోయింది. గ‌తేడాది నెంబ‌ర్ వ‌న్ ఉన్న కాజ‌ల్ కాస్తా ఇప్పుడు సెకండ్ ప్లేస్ కు ప‌డిపోయింది. 2017కు హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా నిలిచింది పూజాహెగ్డే. తమన్నా 6వ స్థానంలో.. రకుల్ ప్రీత్ సింగ్ 3వ స్థానంలో.. అనుష్క 9వ స్థానంలో.. అదా శర్మ 5వ స్థానంలో.. క్రికెట్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ 10వ స్థానంలో నిలబడ్డారు. రాశీఖ‌న్నా, స‌మంత లాంటి స్టార్ హీరోయిన్లు ఈ లిస్ట్ లో ఎక్క‌డో చివ‌ర్లో ఉన్నారు. మొత్తానికి ఇదంతా చూస్తుంటే ఇప్పుడు పూజా టైమ్ స్టార్ట్స్ నౌ అనిపిస్తుంది.

User Comments