టాలీవుడ్ ల‌క్కీయెస్ట్ నిర్మాత‌

Last Updated on by

సీఎం భ‌ర‌త్ ప్ర‌మాణ‌స్వీకారం ఇంకా చెవుల్లో రింగ్‌మంటూనే ఉంది. న‌వ‌శకం విర‌చించే కొత్త సీఎం వ‌చ్చాడంటూ తెలుగువారంతా ఖుషీగా వోన్ చేసుకున్నారు. మ‌హేష్‌కి మ‌ర‌పురాని విజ‌యాన్ని ఇచ్చారు. `భ‌ర‌త్ అనే నేను` బాక్సాఫీస్ వ‌ద్ద 100కోట్ల షేర్ వ‌సూలు చేసింద‌ని డివివి సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. దాన‌య్య‌లో ఆనందం ఆకాశ‌పుటంచును తాకింది. బ్రూస్‌లీలాంటి భారీ ఫ్లాప్‌ని చ‌విచూసిన దాన‌య్య‌కు ఉన్న‌ట్టుండి అన్నీ క‌లిసొస్తున్నాయ్‌. వ‌రుసగా క్రేజీ సినిమాల లైన‌ప్ అత‌డిని ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యేలా చేస్తోంది. ఇదే ఉత్సాహంలో ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను అర్థ‌శ‌త‌దినోత్స‌వ ట్రైల‌ర్‌ని రిలీజ్ చేసింది డివివి సంస్థ‌.

మొత్తానికి టాలీవుడ్‌లో ఉన్న చాలామంది నిర్మాత‌ల‌కు ద‌క్క‌ని అదృష్టం దాన‌య్య కు ద‌క్కింద‌న్న చ‌ర్చ ప్ర‌స్తుతం ఫిలింస‌ర్కిల్స్‌లో సాగుతోంది. అత‌డో ల‌క్కీ ప్రొడ్యూస‌ర్‌.. భ‌ర‌త్ తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకుని ఆ వెంట‌నే `రంగ‌స్థ‌లం`తో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన చ‌ర‌ణ్‌తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఇరువైపుల నుంచి పాజిటివ్ వైబ్రేష‌న్ బోయ‌పాటి-చ‌ర‌ణ్ సినిమాకి పెద్ద రేంజులో క‌లిసొస్తోంది. ఆ క్ర‌మంలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ దున్నేస్తోంద‌న్న రిపోర్ట్ అందింది. నిర్మాత‌గా దాన‌య్య ఫుల్ సేఫ్‌. త‌దుప‌రి ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళితో రామ్‌చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ తాజా అప్‌డేట్‌ని డివివి మీడియా తొంద‌ర్లోనే వెల్ల‌డిస్తుంద‌ని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

User Comments