డ్రగ్స్ వల్లే ఆ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు మృతి

Tollywood Music director died due Drugs

టాలీవుడ్ ను ప్రస్తుతం డ్రగ్స్ కేసు కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. డ్రగ్స్ తో సంబంధాలు కలిగి ఉన్నారని ఓ స్టార్ డైరెక్టర్, యంగ్ హీరోలు, హీరోయిన్స్ తో కూడిన ఓ 12 మంది జాబితా బయటకు రావడంతో కలకలం మొదలైంది. వీళ్ళందరికీ అధికారులు నోటీసులు జారీ చేయడం ఎలా ఉన్నా..విచారణలో డ్రగ్ వ్యాపారి కెల్విన్ సినీ పరిశ్రమలోని చాలా మందికి డ్రగ్స్ ని సరఫరా చేసినట్లు తేలిందని న్యూస్ రావడం గమనార్హం. దీంతో ఇప్పుడు ఆ 12 మంది కాక చాలామంది పేర్లు బయటకు రావాల్సి ఉందని సమాచారం. ఇదిలా ఉంటే, తాజాగా పోలీసుల విచారణలో కెల్విన్ చెప్పినట్లు తెలుస్తోన్న కొన్ని షాకింగ్ విషయాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా ఇటీవల ఓ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అకాల మరణానికి డ్రగ్సే కారణమని అంటుండటం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.
అంతేకాకుండా ఎల్ఎస్డీ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్లే ఆ మ్యూజిక్ డైరెక్టర్ చనిపోయాడని, కెల్విన్ అతడికి డ్రగ్స్ సరఫరా చేశాడని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆ మ్యూజిక్ డైరెక్టర్ చనిపోయినప్పుడు తన పని అయిపోయిందని, అరెస్ట్ చేస్తారేమోనని భయపడిపోయానని కెల్విన్ దర్యాప్తులో అధికారులకు చెప్పినట్లు తెలియడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్బంగా ఇటీవల మరణించిన ఓ నటుడికి కూడా ఇలానే కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలిసిందని అంటున్నారు. మొత్తంగా ఇప్పుడు సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడుతున్న చాలామంది అది లేకపోతే ఉండలేని పరిస్థితి చేరుకున్నారని స్వయంగా కెల్విన్ చెప్పినట్లు తెలియడం విశేషం. మరి ఈ లెక్కన అధికారులు ఎంతమందిపై చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇప్పుడైతే, నోటీసులు అందుకున్న ఆ సినీ ప్రముఖులను ఓ వారం పాటు గట్టిగానే విచారించనున్నారని తెలుస్తోంది.