టాలీవుడ్ ప‌ద్ధ‌తేం బాలేదు!

Last Updated on by

అవును .. ఇలా అన్న‌ది ఎవ‌రో తెలుసా? అగ్ర‌నిర్మాత డి.సురేష్‌బాబు. ఆయ‌న‌కు టాలీవుడ్ తీరుతెన్నులు, ప‌ద్ధ‌తులు న‌చ్చ‌లేదు. అందుకే మ‌రో రెండేళ్ల‌లో ప్ర‌క్షాళ‌న చేసి, ఓ కొత్త ప‌ద్ధ‌తిని, విధానాన్ని తీసుకొస్తాన‌ని చెబుతున్నారు. ఈ న‌గ‌రానికి ఏమైంది? ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ఆయ‌న సినీప‌రిశ్ర‌మ తీరుతెన్నుల‌పై తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. దీనిపై ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఎక్క‌డ మంచి ప‌ద్ధ‌తులు ఉన్నాయో అక్క‌డ నంబ‌ర్ 1 కి ప‌రిశ్ర‌మ వెళులోంద‌ని సురేష్‌బాబు అన్నారు. టాలీవుడ్ స‌క్సెస్ రేటు దారుణంగా ఉండ‌డానికి కార‌ణాల్ని ప్ర‌స్థావించారు. ఇక దీనికి సొల్యూష‌న్ క‌నిపెడుతున్నామ‌ని ఆయ‌న అన‌డం సంచ‌ల‌న‌మైంది.

టాలీవుడ్‌లో ప్రాసెస్ స‌రిగా లేదు.. అందుకే ఫెయిల్యూర్స్ ఎక్కువ అని ఆయ‌న అన్నారు. ఇత‌ర రంగాల్లో ఉన్న‌ట్టు స‌రైన ప్రాసెస్ లేదని అభిప్రాయ‌ప‌డ్డారు. సినిమా మేకింగ్‌, థియేట‌ర్ల నిర్వ‌హ‌ణ‌, స్టూడియోల నిర్వ‌హ‌ణ వంటి విభాగాల్లో ఎంతో అనుభ‌వం ఉన్న నిర్మాత‌గా ఆయ‌న ఈ మాట‌ల‌న్నారు. అయితే టాలీవుడ్ ప్రాసెస్‌లో ఏం కొత్త మార్పు తెస్తారు? అన్న‌ది మాత్రం ఇప్ప‌టికైతే ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. ఆయ‌న ప్రాక్టిక‌ల్‌గా ఏం మార్పు తెస్తారు? అన్న‌ది వేచి చూడాలి. కొత్త కుర్రాళ్ల‌తో ప‌రిమిత బ‌డ్జెట్‌లో త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ న‌గ‌రానికి ఏమైంది? ఈ శుక్ర‌వారం రిలీజ్ కానుంది.

User Comments