2019 నంబ‌ర్ -1 హీరో ఎవ‌రు?

Last Updated on by

టాలీవుడ్ లో డ‌జ‌ను మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఎవ‌రి సీజ‌న్ లో వాళ్లు ఏలారు. హిట్లు, బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టి ప‌రిశ్ర‌మ‌లో కొత్త సంద‌డి తెచ్చారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, కృష్ణ‌, శోభ‌న్ బాబు వీళ్లంతా ఒక టైమ్ లో ఏలారు. ఆ త‌ర్వాత చిరంజీవి, బాల‌కృష్ణ, నాగార్జున, వెంక‌టేష్‌ టైమ్ వ‌చ్చింది. చాలా కాలం ఎదురేలేని హీరోగా మెగాస్టార్ చిరంజీవి కొన‌సాగారు. ఆ త‌ర్వాత ఆ స్థానాన్ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ అందిపుచ్చుకున్నారు. ప‌వ‌న్, మ‌హేష్ మ‌ధ్య పోటాపోటీ న‌డిచింది. అయితే ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వెళ్లాక మాత్రం పూర్తిగా సందిగ్ధత నెల‌కొంది.

ప‌వ‌న్ త‌ర్వాత ఆ రేంజులో అర‌డ‌జ‌ను హీరోలు రాణిస్తున్నారు. మ‌హేష్, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్, ప్ర‌భాస్ లాంటి స్టార్లు ఎవ‌రూ ఎవ‌రికీ తీసిపోరు. వీళ్లంతా 100కోట్ల క్ల‌బ్ హీరోలే. ఎవ‌రి సినిమా రిలీజైతే వాళ్లే నంబ‌ర్- 1 హీరోగా క‌నిపిస్తున్నారు. సినిమా హిట్ట‌యితే 100కోట్లు ఆర్జించి చూపిస్తున్నారు. ఇండ‌స్ట్రీ హిట్లు కొట్టి రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. ఇటీవ‌లే వీళ్ల‌లో ఎవ‌రికీ నిల‌క‌డ‌గా వ‌రుస హిట్లు లేవు. హిట్టు కొడితే మాత్రం క‌లెక్ష‌న్లు కురిపించే స‌త్తా ఉంద‌ని నిరూపిస్తున్నారు. ఫ్లాపైనా మినిమం క‌లెక్ష‌న్ల ప‌రంగా ఏ డోఖా లేని హీరోలుగా ముద్ర వేశారు. అందుకే వీళ్ల నుంచి ఎవ‌రో ఒక‌రిని నంబ‌ర్ -1 హీరో అని చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇలాంటి టైమ్ లో కొంత గ్యాప్ తీసుకుని మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చి న‌వ‌త‌రం హీరోల‌తో పోటీప‌డుతూ బాక్సాఫిస్ రికార్డుల్ని తిర‌గ‌రాసే సినిమాల్లో న‌టించేస్తున్నారు. అందుకే.. ఇక్క‌డ ఏ రోజుకారోజే అంకెల గార‌డీ మారుతోంది. స్థానాలు మారుతున్నాయి. నేడు ఒక‌రు.. రేపు ఇంకొక‌రు.. అటుపై వేరొక‌రొస్తారు.. అన్న చందంగానే ఉంది ప‌రిస్థితి. అదీ సంగ‌తి.

Also Watch:Heroine Manisha Latest Stills

User Comments