సైరా టీజ‌ర్ పై టాలీవుడ్ మౌనం

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి టీజ‌ర్ విడుద‌లై కొన్ని గంట‌లు గుడ‌స్తోంది. ముంబైలో ప్ర‌త్యేకంగా ఈవెంట్ నిర్వ‌హించారు. అయితే సైరా టీజ‌ర్ పై మాత్రం టాలీవుడ్ నుంచి ఎలాంటి రియాక్ష‌న్స్ లేవు. ప‌రిశ్ర‌మ అంతా స్త‌బ్ధుగా ఉంది. కేవ‌లం కొంత మంది అభిమానులు త‌ప్ప‌! స్పందించింది త‌క్కువ‌నే చెప్పాలి. స్టార్ హీరోలంతా త‌మ సినిమా షూటింగ్ ల‌తో బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా ఓ ట్వీట్ వేసేంత స‌మ‌యం అయితే ఉంటుంది.

కానీ ఏ హీరో స్పందించిన‌ట్లు లేదు. ఇక ప్ర‌భాస్ న‌టించిన సాహో ట్రైల‌ర్ చూసిన చిరంజీవి ఆయ‌న‌కి నేరుగా ఫోన్ చేసి మ‌రీ ప్ర‌శంసించారు. కానీ ప్ర‌భాస్ నుంచి చిరుకు మాత్రం ఎలాంటి ఫీడ్ బ్యాక్ వెళ్లిన‌ట్లు లేదు. మ‌రి వ్య‌క్తిగ‌తంగా సంభాషించారా? అన్న‌ది తెలియాలి. ఇక ఎన్టీఆర్ , చ‌ర‌ణ్ ఆర్ ఆర్ ఆర్ లో క‌లిసి న‌టిస్తున్నారు. తార‌క్ కూడా ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌లేదు. మ‌హేష్ బాబు రేర్ కేస్. ఎంత గొప్ప సినిమా తీసినా మాట్లాడ‌డు. ప‌క్క రాష్ర్టం సినిమాల‌పై చూపించే ఉత్సాహం తెలుగు సినిమాల‌పై చూపించ‌డ‌ని ఓ విమ‌ర్శ ఎప్ప‌టి నుంచో ఉండ‌నే ఉంది. మ‌రి లేటు రియాక్ష‌న్స్ ఉంటాయేమో చూడాలి.