4 కోట్ల స‌బ్సిడీ పెండింగులోనే

Last Updated on by

తెలుగు నిర్మాత‌ల‌కు ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లున్నాయి. జీఎస్టీ, డీఎస్‌పీ (స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు) స‌మ‌స్య‌లు ఇంకా తెగ‌నేలేదు. ఇవేగాక ర‌క‌ర‌కాల వివాదాలు టాలీవుడ్‌పై దందెత్తుతున్నాయి. అయితే వీటితో పాటు ప్ర‌భుత్వాల త‌ర‌పు నుంచి స‌హ‌కారం అంతంత మాత్ర‌మేన‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. దాదాపు 4కోట్ల మేర ప్ర‌క‌టించిన స‌బ్సిడీని ప్ర‌భుత్వం నిర్మాత‌ల‌కు చెల్లించ‌లేదంటే సినీరంగాన్ని ప్ర‌భుత్వాలు ఏ తీరుగా ప‌ట్టించుకుంటాయో అర్థం చేసుకోవాలి.

ఓ లెక్క ప్ర‌కారం తెలుగు సినీప‌రిశ్ర‌మ నిర్మాత‌ల‌కు ప్ర‌భుత్వాల నుంచి రావాల్సిన స‌బ్సిడీ 4.10కోట్లు పెండింగులో ప‌డి ఉందిట‌. ఆ మేర‌కు నిర్మాత‌ల సెక్టార్ కౌన్సిల్ చైర్మ‌న్ వ‌ల్లూరి ప‌ల్లి ర‌మేష్ .. ఆ మొత్తాన్ని సీఎంల‌తో మాట్లాడి ఇప్పించాల్సిందిగా చాంబ‌ర్ నూత‌న అధ్య‌క్షుడిని కోరారు. “రాష్ట్రం విడిపోక ముందు ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు. 1999 నుంచి చిన్న సినిమాల‌కు స‌బ్సిడీలు ఇచ్చేవారు. కొన్ని సినిమాల‌కు స‌బ్సిడీ ప్ర‌క‌టించేసినా ఇంకా చెల్లించ‌నేలేదు. 4 కోట్ల 10ల‌క్ష‌ల‌ స‌బ్సిడీ నిర్మాత‌ల‌కు ఇప్పించాల్సి ఉంది. ఫిలింఛాంబ‌ర్ గ‌త అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుకు, రామ్మోహ‌న్ గారి స‌మక్షంలో విన్న‌వించినా ఫ‌లితం లేదు. సీఎమ్‌ల‌ను క‌లిసి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి. స‌బ్సిడీని ఇప్పించాలి“ అని కోరారు. అదీ సంగ‌తి.

User Comments