విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై టాలీవుడ్ స్పంద‌న‌

Last Updated on by

తెలంగాణ రాష్ర్టం ఇంటర్‌ బోర్డు ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆందోళనలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామన్న బాధతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో విద్యార్ధులు, త‌ల్లిదండ్రులు ప్రభుత్వ ప‌నితీరును దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా విద్యార్ధ‌లు ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌ల‌ను ఉద్దేశించి టాలీవుడ్ ప్ర‌ముఖులు ట్వీట్లు చేసారు.

సాయిధ‌ర‌మ్ తేజ్ స్పందిస్తూ, ` ప్రియ‌మైన విద్యార్ధులారా, ప‌రిక్ష ఫ‌లితాలు ప్ర‌పంచానికి ముగింపు కాదు. జీవితంలో ఇంకా ఎన్నో స‌వాళ్లున్నాయి. ప‌రీక్ష ఫెయిలైతే జీవిత‌మే లేద‌నుకోవ‌డం పిరికిబంద‌ల చ‌ర్య‌. స‌మ‌స్య ఏదైనా ధైర్యంగా పోరాడాలి. అప్పుడే జీవితానికి ఓ అర్ధం ఉంటుంది. మీ ఆశ‌ల్నీ స‌జీవంగా ఉంచండి. సంపుకోవ‌ద్దు అంటూ ట్వీట్ చేసారు. ప‌రీక్ష‌ల్ని మించిన జీవితం చాలా ఉంది. చిన్న వ‌య‌సులో చ‌దువు అంటూ పిల్ల‌ల‌పై త‌ల్లిదండ్ర‌లు ఒత్తిడి తీసుకురావొద్దు. ఈ ఘ‌ట‌న‌ను ఖండిస్తున్నా అని మంచు మ‌నోజ్ ట్వీట్ చేసారు. ఫెయిల్యూర్ మ‌న జీవితాన్ని నిర్దేశించ‌దు. అది కేవ‌లం ఓ ఘ‌ట‌న మాత్రే. జీవితం ప‌రీక్ష‌ల కంటే పెద్ద‌ది. అవి కేవ‌లం స్పీడ్ బ్రేక‌ర్లు మాత్ర‌మే. అక్క‌డ గేర్ మార్చితే స‌రిపోతుందని ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ అన్నారు. స్టూడెంట్ గా ఉన్నప్పుడు నేను పెద్ద‌గా చ‌ద‌వే వాడ్ని కాదు. కానీ యానిమేషన్‌లో టాపర్‌ అయ్యా. చ‌దువు న‌న్ను ద‌ర్శ‌కుడ్ని చేయ‌లేదు. ఇష్ట‌ప‌డి వ‌చ్చాను కాబ‌ట్టి ద‌ర్శ‌కుడ్ని అయ్యా. మంచి జీవితాన్ని శూన్యం చేసుకోకండని మారుతి ట్వీట్ చేసాడు. ఇంకా న‌వ‌దీప్, సంపూర్ణేష్ బాబు త‌న‌వు చాలించిన‌ విద్యార్ధుల‌కు నివాళ్లులు అర్పించారు.


Related Posts