జూన్ 29 కి రెడీ అవుతున్నారు

Last Updated on by

ఒకేరోజు రెండు సినిమాలు రావ‌డం చూస్తూనే ఉంటాం.. ఒక్కోసారి మూడు నాలుగు సినిమాలు కూడా వ‌స్తుంటాయి. కానీ అన్నీ చిన్న సినిమాలే. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. అయితే లెక్క ఇంకా ఎక్కువే. ఇన్నాళ్లూ ఆగిన చిన్న సినిమాల‌న్నీ ఒకేసారి రెక్క విప్పుకుంటున్నాయి. జూన్ 29న ఒక‌టి రెండు కాదు.. ఏకంగా ఏడు సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. అందులో అంద‌రి క‌ళ్లు మాత్రం ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాపై ఉన్నాయి. పెళ్లిచూపులు లాంటి సంచ‌ల‌నం త‌ర్వాత త‌రుణ్ భాస్క‌ర్ నుంచి వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపైనే ఆస‌క్తి ఉంది. పైగా ఈ చిత్రాన్ని సురేష్ బాబు నిర్మించాడు.

ఇక ఇదే రోజు మ‌రో ఆరు సినిమాలు కూడా రానున్నాయి. అయితే అందులో చాలా మందికి అలాంటి సినిమాలు ఒక‌టి వ‌స్తున్నాయ‌నే విష‌యం కూడా తెలియ‌దు. సంజీవని.. క‌న్నుల్లో నీ రూప‌మే.. అల్లుశిరీష్ మ‌ళ‌యాల డ‌బ్బింగ్ సినిమా యుద్ధ‌భూమి.. సూప‌ర్ స్కెచ్.. ఇలా ఊరుపేరు లేని సినిమాలు కూడా జూన్ 29నే రానున్నాయి. ఇక హిందీలో సంజూ కూడా అదే రోజు రానుంది. ఈ చిత్రం తెలుగులోనూ స‌త్తా చూపించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఎందుకంటే రాజ్ కుమార్ హిరాణి ద‌ర్శ‌కుడు కావ‌డం ఒక కార‌ణ‌మైతే.. సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్ కావ‌డం మ‌రో రీజ‌న్. ఖచ్చితంగా మ‌న సినిమాల‌ను సైతం డామినేట్ చేసేలాగే సంజూ ఓపెనింగ్స్ రావ‌డం ఖాయం.

User Comments