మన తారలు భయపడుతున్నారు.. దేనికో తెలుసా..?

 

సినిమా తీయాలంటే ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. సినిమా అందంగా  చూపించాలి అంటే అందమైన లొకేషన్లు కావాలి. ఆ లొకేషన్ల కోసం మనోళ్లు ఎక్కువుగా ఎక్కడికి వెళ్తారో తెలుసు కదా.. అదే బ్యాంకాక్. తక్కువ ఖర్చులో కలర్ ఫుల్ లైఫ్ కనిపిస్తుంది కాబట్టి ఛాన్స్ దొరికినప్పుడల్లా మనవాళ్ళు అక్కడకు ఎగిరిపోతున్నారు. కానీ ఇప్పుడు ఈ బ్యాంకాక్ పేరు చెప్తేనే మన సెలబ్రిటీలు హడలి పోతున్నారు. ఈ క్రమంలోనే బ్యాంకాక్ కు ఎందుకు, వేరే ఎక్కడైనా షూటింగ్ పెట్టుకుందామని అంటున్నారట. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా.. దానికి కారణాలు చాలా ఉన్నాయి.
అందులో ఒక కారణం డ్రగ్స్. గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీని డ్రగ్స్ మాఫియా ఎంతలా ఇబ్బంది పెడుతోందో తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో చాలా మంది నటులు, సాంకేతిక నిపుణులు విచారణను ఎదుర్కొన్నారు. దీంతో మిగతా నటులు కూడా దీనికి దూరంగా ఉండటమే మంచిది అనుకుంటున్నారు.  ఎందుకు వచ్చిన గొడవలే.. అక్కడి వెళ్లిన దగ్గరి నుంచి తిరిగి వచ్చాక ఏదో ఒక పేరుతో మరలా విచారణ అంటారు అని భయపడుతున్నారు. బ్యాంకాక్ అందంగా ఉండటమే కాకుండా.. షూటింగ్ ల కోసం రాయితీ కూడా ఇస్తుండటంతో మనవాళ్ళు ఎక్కువగా అక్కడికి వెళ్లే సంగతి తెలిసిందే కదా. కానీ ఇప్పుడు మనవాళ్ళు దానికి ఎక్కువగా నో చెబుతుండటంతో.. అప్పటికప్పుడు బ్యాంకాక్ కు ప్రత్యామ్నాయంగా మరో సిటీ ఎక్కడ ఉందోనని మేకర్స్ కష్టాలు పడుతున్నారట. ఈ లెక్కన బ్యాంకాక్ ఇచ్చే కిక్ మనవాళ్లకు కొన్నాళ్ళు లేనట్టేనేమో.