టాలీవుడ్ క‌థ ఎటు ప‌రిగెడుతోంది?

Last Updated on by

ప్ర‌తి ఐదోళ్లకోసారి, ప్ర‌తి ప‌దేళ్ల కోసారి టాలీవుడ్ తీరుతెన్నులు ప‌రిశీలిస్తే, సామాజిక-రాజ‌కీయ‌-ఆర్థిక ప‌రిస్థితుల క‌నుగుణంగా మ‌న క‌థ‌లు మారుతున్నాయా?   అంటే అవుననే చెప్ప‌గ‌లం. అయితే ఒక్కో ఫేజ్‌లో క‌థ ఒక్కో శైలిని ఫాలో అయ్యింది. 80ల‌లో స‌మాజం వేరు.. 90 ల‌లో.. 2000లో.. 2010లో … 2020కి చేరువ‌లో మ‌న తెలుగు సినిమా క‌థ‌ల్లో అనూహ్య మార్పు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌ల ఆలోచ‌న‌ల్లో ప‌రిణ‌తి ప‌రాకాష్ట‌లో ఉంద‌నే చెప్పాలి. ముఖ్య ంగా ప్ర‌యోగాలు చేసేందుకు ఏమాత్రం భ‌య‌ప‌డ‌ని ధీర‌త్వ ం క‌నిపిస్తోంది. తీసే ప్ర‌తి సినిమాలో ఏదో  ఒక కొత్త‌దనం, ఏదో ఒక ప్ర‌యోగం.. లేదూ ఇంకేదో భారీత‌నం చూపించాల‌ని త‌పిస్తున్నారు. అయితే ఇదేమీ ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. డ‌బ్బుతో ప్ర‌యోగం.. మేధోత‌నం పీక్స్‌లో చూపిస్తే మాత్ర‌మే వ‌ర్క‌వుట‌య్యే వ్య‌వ‌హారం.
ఘాజీ, బాహుబ‌లి, రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను .. ఇవ‌న్నీ భారీ ప్ర‌యోగాలే. ఇవ‌న్నీ పెద్ద స‌క్సెస‌య్యాయి. ఈ స‌క్సెస్‌తో మ‌రింత‌గా ప్ర‌యోగాలు చేసేందుకు ఆస్కారం క‌నిపిస్తోంది. ఇక ముందు రానా న‌టిస్తున్న హాథీ మేరా సాథీ,  టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమా, వ‌రుణ్‌తేజ్‌- సంక‌ల్ప్‌రెడ్డి స్పేస్ సినిమా.. ఈ త‌ర‌హా ప్ర‌యోగాలే. ఇక‌పోతే సంఘంలో అసాధార‌ణ స‌న్నివేశాల్ని, త‌ప్పిదాల‌ని ఎత్తి చూపుతూ .. వాటికి ప‌రిష్కారం క‌నుగొనే క్ర‌మంలో పుట్టుకొచ్చే సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌లు ఇక ముందు టాలీవుడ్‌లో పుట్టుకు రానున్నాయి. మునుముందు ఫిక్సన్, సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌ల‌కు ప్రాధాన్య‌త పెర‌గ‌నుంది. హాలీవుడ్‌లో ఎన్నో విల‌క్ష‌ణ క‌థ‌ల‌తో అతి భారీ ప్ర‌యోగాలు చేశారు. చేస్తున్నారు… ఆ స్థాయిలో ఛేజ్ చేయ‌క‌పోయినా బ‌డ్జెట్ ప‌రిథిలో మ‌న క‌థ‌ల్లో మార్పు క‌నిపించ‌నుంది. 2010-20 మ‌ధ్య ద‌శ వేరు. మునుముందు 2020, 2030, 2040 వ‌చ్చే నాటికి మ‌న క‌థ రూపురేఖ‌లే మారిపోతుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక ప్ర‌ఖ్యాత స్క్రీన్‌ప్లే ర‌చ‌యితలు చెప్పిన దాని ప్ర‌కారం, సిడ్ ఫీల్డ్స్ స్క్రీన్‌ప్లే ఫార్ములా ప్ర‌కారం.. ఏ సినిమాలో ఎక్కువ మాట‌లు ఉండ‌వో, ఏ సినిమాలో ఎక్కువ విజువ‌ల్స్ మాత్ర‌మే ఎగ్జ‌యిట్ చేస్తాయో.. అలాంటి సినిమాల‌కు మునుముందు ఆస్కారం ఉంది. చూద్దాం.. టాలీవుడ్ క‌థ ఇంకా ఇంకా ఎటువైపు ప‌య‌నం కానుందో?

User Comments