టాలీవుడ్ టాప్ 10 హీరోలు

Last Updated on by

2018 ఫ‌స్టాఫ్ రిపోర్ట్ ఆధారంగా టాప్ 10 హీరోల్ని లెక్కించాల్సి వ‌స్తే ఇదిగో క్లియ‌ర్‌క‌ట్‌ వివ‌రం. ప్ర‌ముఖ ఫిలింక్రిటిక్‌ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ప్ర‌మోట్ చేస్తున్న బాక్సాఫీస్ ఇండియ‌న్ వెబ్‌సైట్ తెలుగులో టాప్ 10 హీరోల గురించి లెక్క తేల్చింది. ఈ ఏడాది ప్ర‌థ‌మార్థం రిలీజ్‌లు.. బాక్సాఫీస్ స‌క్సెస్‌, ఆ త‌ర్వాత జ‌నాల్లో క్రేజును, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ప‌ది పేర్లు రివీల్ చేసింది. రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేష్‌, ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, అల్లు అర్జున్‌, నాని, రానా, వ‌రుణ్‌తేజ్‌, ర‌వితేజ పేర్ల‌ను టాప్ 10 జాబితాలో ఉంచింది.

ఈ జాబితా బాగానే ఉంది కానీ, వాస్త‌వానికి ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో క్రేజీ రిలీజ్‌లు కేవ‌లం రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేష్ బాబు సినిమాలు మాత్ర‌మే. చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లం ఇండ‌స్ట్రీ రికార్డ్ హిట్ కొట్టింది. ఈ సినిమా దాదాపు 200 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింద‌ని నిర్మాత‌లు పోస్ట‌ర్ వేశారు. దాదాపు 120 కోట్ల షేర్ వ‌సూళ్లు ద‌క్కాయ‌ని అధికారికంగానే ప్ర‌క‌టించారు. ఇక‌పోతే ఆ వెంట‌నే రిలీజైన మ‌హేష్ `భ‌ర‌త్ అనే నేను` చ‌క్క‌ని వ‌సూళ్ల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యం అందుకుంది. ఈ సినిమాకి డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ అధికారికంగా 200కోట్ల క్ల‌బ్ పోస్ట‌ర్‌ని వేసింది. ఇవి రెండూ జెన్యూన్ హిట్స్. అందువ‌ల్ల రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేష్‌ల‌ను జాబితాలో టాప్ హీరోలుగా డిక్లేర్ చేయొచ్చు. ఇక‌పోతే ప్ర‌భాస్‌, ఎన్టీఆర్, ప‌వ‌న్ సినిమాలేవీ ప్ర‌థ‌మార్థంలో రిలీజ్ కాలేదు. బ‌న్ని సినిమా `నా పేరు సూర్య` ఎంతో క్రేజీగా రిలీజైనా.. డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో అత‌డి గ్రాఫ్ కిందికెళ్లింది. హిట్టు డిసైడ్ చేసే ప‌రిశ్ర‌మ‌లో జాబితా ఎప్ప‌టిక‌ప్పుడు మారుతూ ఉంటుంది. ఇప్ప‌టికైతే చ‌ర‌ణ్‌, మ‌హేష్‌దే హ‌వా.

User Comments