2018 టాప్ -5 టాలీవుడ్‌ హీరోలు

Last Updated on by

2018 టాప్ 5 హీరోలు ఎవరు?  రిలీజైన సినిమాలు, స‌క్సెస్ శాతం, క‌లెక్ష‌న్ల దూకుడు .. యూత్‌లో క్రేజు వ‌గైరా ప‌రిశీలిస్తే ఓ ఐదుగురిని జాబితాలో చేర్చ‌వ‌చ్చు. ఆ ఐదుగురు నువ్వా నేనా అంటూ పోటీప‌డిన‌వాళ్లే.
దేవ‌ర‌కొండ‌: గీత‌గోవిందం, టాక్సీవాలా బంప‌ర్ హిట్లు కొట్ట‌డంతో ఈ హీరో జాత‌క‌మే మారిపోయింది. ప్ర‌స్తుతం టాలీవుడ్ వ‌ర్గాలు స‌హా యూత్‌లో న‌లుగుతున్న ఏకైక నామ‌ధేయ‌మిది. నోటాతో ఝ‌ల‌క్ తిన్నా టాక్సీవాలాతో రిక‌వ‌రీ చేసుకుని ట్రాక్‌లో ప‌డ్డాడు. యూత్‌లో పిచ్చి క్రేజున్న రౌడీగా దేవ‌ర‌కొండ పాపులారిటీ మామూలుగా లేదు. అందుకే అత‌డు నంబ‌ర్‌1.
రామ్‌చ‌ర‌ణ్‌: ర‌ంగ‌స్థ‌లం చిత్రంతో త‌న‌పై ఉన్న అన్ని విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేశాడు. చెవిటి- మూగ వాడైన గోదారి కుర్రాడి పాత్ర‌లో అద‌ర‌గొట్టేశాడు. ఇండ‌స్ట్రీ లో నాన్ బాహుబ‌లి రికార్డుల్ని చెరిపేసి స‌త్తా చాటాడు. అత‌డి కెరీర్‌కి ఈ ఏడాది కీల‌క మ‌లుపు. అందుకే నంబ‌ర్ 2. త‌దుప‌రి చిత్రం `విన‌య విధేయ రామా` సెట్స్‌పై ఉన్న సంగ‌తి తెలిసిందే.
ఎన్టీఆర్: వ‌రుస విజ‌యాల‌తో స్కైలోకి దూసుకొచ్చిన తార‌క్ రేంజు వేరుగా ఉంది. క‌థ‌ల ఎంపిక‌లో వెరైటీ, ష‌టిల్డ్ పెర్ఫామెన్స్‌తో అభిమానుల్ని అల‌రిస్తున్నాడు. ఈ ఏడాది అర‌వింద స‌మేత చిత్రంలో మ‌రో వైవిధ్య‌మైన పాత్ర‌లో అల‌రించాడు. రాయ‌ల‌సీమ యాస‌లో ర‌చ్చ చేశాడు. అత‌డు నంబ‌ర్ 3.
మ‌హేష్:  ఒక పెద్ద అప‌జయం త‌ర్వాత `భ‌ర‌త్ అనే నేను` చిత్రంతో బంప‌ర్ హిట్ కొట్టి ట్రాక్‌లోకొచ్చాడు. సొసైటీని మార్చే యువ ముఖ్య‌మంత్రిగా మ‌హేష్ అభిన‌యానికి జ‌నం నీరాజ‌నం ప‌లికారు. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోగా మ‌హేష్ వెలుగులు మామూలుగా లేవు. ఈ ఏడాది నంబ‌ర్ 4 అత‌డి స్థానం.
వరుణ్‌తేజ్‌: గ‌మ్మ‌త్త‌యిన స్క్రిప్టుల్ని ఎంపిక చేసుకుంటూ మెగా కాంపౌండ్‌లోనే వేరియేష‌న్ ఉన్న హీరోగా నిరూపించుకుంటున్నాడు వ‌రుణ్‌తేజ్‌. గ‌తేడాది ఫిదా చిత్రంతో బంప‌ర్ హిట్ కొట్టిన వ‌రుణ్ ఈ ఏడాది `తొలి ప్రేమ‌` చిత్రంతో మ‌రో విజ‌యం అందుకుని యూత్‌కి బాగా చేరువ‌య్యాడు. ప్ర‌స్తుతం అంత‌రిక్షం లాంటి భారీ ప్ర‌యోగం చేస్తూ మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యాడు. అత‌డి స్థానం నంబ‌ర్ 5.

User Comments