షాక్‌: విమానంలోంచి హీరో జంప్‌!

Last Updated on by

భ‌యానికే భ‌యం నేర్పే అరుదైన ఫీట్ ఇది. ఇలాంటి సాహ‌సం ప్ర‌పంచంలో చాలా చాలా రేర్!! అంత‌టి ప్ర‌మాద‌క‌ర విన్యాసం చేసే ద‌మ్ము టాలీవుడ్‌లో ఏ హీరోకి అయినా ఉందా? క‌నీసం బాలీవుడ్ హీరోలు అయినా అలాంటి ఫీట్ వేయ‌గ‌ల‌రా?.. అస్స‌లు ఛాన్సే లేదు. దాదాపు 25వేల అడుగుల ఎత్తు నుంచి స‌ద‌రు హాలీవుడ్ హీరో జంప్ చేశాడు. అది కూడా ర‌న్నింగ్ విమానంలోంచి బాంబ‌ర్‌లా దూకేశాడు. అస‌లు జంకూ గొంకూ లేని ఆ హీరోగారు ఇంత‌కీ ఎవ‌రు?
అన్నివేల కిలోమీట‌ర్ల ఎత్తున అస‌లు ఊపిరి అంద‌నే అంద‌దు. అలాంటి చోట గాల్లో ఆ జంప్ చూస్తుంటే ఒళ్లు గ‌గుర్పొడ‌వ‌కుండా ఉండ‌దు. ఈ రేర్ ఫీట్ వేసింది ది గ్రేట్ యాక్ష‌న్ హీరో టామ్ క్రూజ్‌. అత‌డు న‌టిస్తున్న తాజా చిత్రం `మిష‌న్ ఇంపాజిబుల్‌- ఫాలౌట్`లోనిది ఈ స‌న్నివేశం. ఈ జంప్‌ని హ్యాలో జంప్ అని పిలుస్తున్నారు. అంతెత్తు నుంచి దూకేయ‌గానే వెంట‌నే ప్యారాచూట్ వ‌దిలేయ‌రు. కొంత‌సేపు గాల్లోనే డైవ్ చేసిన త‌ర‌వాత నెమ్మ‌దిగా టైమ్ చూసుకుని ప్యారాచూట్ వ‌ద‌లాలి. ఈ ఫీట్‌ని రియ‌ల్ గా వేసి చిత్ర‌యూనిట్‌కే షాక్‌నిచ్చాడు టామ్ క్రూజ్. ఈ త‌ర‌హా భారీ రిస్కీ స‌న్నివేశాల్లో న‌టించ‌డం అత‌డికి కొత్తేమీ కాదు కానీ, చూసేవాళ్ల‌కే అవ‌న్నీ వింత‌లు. ఇదివ‌ర‌కూ విమానంలోంచి దూకి..  పొర‌పాటున జారి ప‌డి రెక్క‌ అంచును ప‌ట్టుకుని వేలాడాడు. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఆ షాట్‌లో అత‌డి ప్రాణాలు పోయేవే. ఇప్పుడు అంత‌కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన జంప్ చేసి ఔరా! అనిపించాడు. 240 మైళ్ల (340కి.మీ) వేగంతో అత‌డు భూమి వైపు రాకెట్‌లా దూసుకొచ్చాడు. 2 నిమిషాల 37 సెక‌న్ల ఈ వీడియో చూస్తే ఎవ‌రికైనా గ‌గుర్పాటు త‌ప్ప‌నిస‌రి. ఇంత‌కీ ఈ జంప్ చేసిన హీరో వ‌య‌సు ఎంతో తెలుసా?  తెలిస్తే షాక్ తింటారు. టామ్ క్రూజ్ వ‌య‌సు 55. ఓరి దేవుడ‌!! మిష‌న్ ఇంపాజిబుల్ సిరీస్ 1996లో మొద‌లైంది. 2018 జూలై 26 ఈ సిరీస్ నుంచి ఆరో సినిమాగా `మిష‌న్ ఇంపాజిబుల్ – ఫాలౌట్` రిలీజ‌వుతోంది.

User Comments