అమెరికాలో టాప్ -5 గ్రాస‌ర్స్‌

Last Updated on by

ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు సినిమా హ‌వా న‌డుస్తోంది. `బాహుబ‌లి సిరీస్` త‌ర‌వాత మ‌న సినిమాపై ఇత‌ర మార్కెట్ల క‌న్ను ప‌డ‌డంతో ఆ స్థాయికి త‌గ్గ సినిమాల్ని మ‌న మేక‌ర్స్ తీస్తున్నారు. ముఖ్యంగా అమెరికా మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకుని మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు `డాల‌ర్ డార్లింగ్ క‌థాంశాల‌`తో సినిమాలు తీయ‌డం ప్ర‌స్తుతం ట్రెండింగ్. ఇప్ప‌టికే అమెరికా బాక్సాఫీస్ వ‌ద్ద బాలీవుడ్ సినిమాల్ని సైతం వెన‌క్కి నెట్టేస్తున్నాయి మ‌న సినిమాలు.
బాహుబ‌లి 1, బాహుబ‌లి 2, రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను, ఖైదీ నంబ‌ర్ 150, అ..ఆ సినిమాలు అమెరికాలో టాప్ 5 గ్రాస‌ర్స్‌గా రికార్డుల‌కెక్కాయి. ప్ర‌స్తుతం మ‌హేష్ `భ‌ర‌త్ అనే నేను` రికార్డుల మోత మోగిస్తూ ఇప్ప‌టికే 2.5 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేయ‌డంతో గ్రాఫ్‌లో టాప్ 4 పొజిష‌న్‌కి చేరుకుంది. ఫుల్ ర‌న్‌లో ఈ సినిమా గ్రాఫ్ ఇంకా పైకి వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఇప్పటికి ఈ సినిమాకి పైన బాహుబ‌లి 1, 2, రంగ‌స్థ‌లం చిత్రాలు ఉన్నాయి. భ‌ర‌త్ త‌ర‌వాత ఖైదీ నంబ‌ర్ 150, అ..ఆ చిత్రాలు టాప్ 5 గ్రాస‌ర్స్‌లో నిలిచాయి. 2.5 మిలియ‌న్ డాల‌ర్లు అంటే దాదాపు 16 కోట్లు పై మాటే. కేవ‌లం రెండు మూడు రోజుల్లోనే ఇంత వ‌సూళ్లు సాధిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా మ‌రో నైజాంగా మారి, 25కోట్లు సంపాదించుకునేంత పెద్ద‌గా ఎదిగింది. ఈ స్థాయి ఊహించ‌లేనిది. అసాధార‌ణ‌మైన‌ది.

User Comments