RRR రేస్‌లో టాప్ బ్యూటీస్

Last Updated on by

ఎస్.ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న RRR ప్ర‌స్తుతం ట్రెండింగ్ టాపిక్. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. ఓ కీల‌క పాత్ర కోసం స‌ముథిర‌క‌నిని ఎంపిక చేసుకున్నారు రాజ‌మౌళి. అయితే ఈ చిత్రంలో క‌థానాయిక‌లు ఎవ‌రు? అన్న‌దానిపై ఇంత‌వ‌ర‌కూ ఏ క్లారిటీ లేదు.

స‌మ్మోహ‌నం, న‌వాబ్, ప‌ద్మావ‌తి వంటి చిత్రాల్లో న‌టించిన అదితీరావ్ హైద‌రీ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంద‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. ఇదివ‌ర‌కూ దీపిక ప‌దుకొనే, ఆలియా భ‌ట్, కీర్తి సురేష్ త‌దిత‌ర పేర్లు జాబితాలో వినిపించాయి. అయితే వీళ్లు ఎవ‌రినీ ఇంకా ఫిక్స్ చేయ‌లేద‌ట‌. వీళ్ల‌తో పాటే తాజాగా బాలీవుడ్ హాట్ గాళ్ ప‌రిణీతి చోప్రా పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఇటీవ‌లే ఈ బ్యూటీని ఆర్.ఆర్.ఆర్ కోసం సంప్ర‌దించార‌ట‌. అయితే ప‌రిణీతి భారీ పారితోషికం డిమాండ్ చేసింద‌ని తెలుస్తోంది. అయితే తాను అడిగినంత మొత్తం ఇచ్చేందుకు రాజ‌మౌళి- దాన‌య్య టీమ్ సంసిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్ద‌డ‌మే ధ్యేయంగా ఏకంగా 300కోట్ల బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఆ ఐదుగురు హీరోయిన్ల‌లో ఎవ‌రికి జాక్ పాట్ త‌గులుతుందో చూడాలి. వీళ్లంతా ప్ర‌స్తుతం ర‌క‌ర‌కాల సినిమాల‌తో బిజీ.. ఎవ‌రికి అదృష్టం ద‌క్కేనో అంటూ హాట్ హాట్ గా చ‌ర్చ సాగుతోంది.

User Comments