అమెరికా రాకెట్‌పై బ‌ర‌స్ట్‌!

Last Updated on by

చికాగోలో తెలుగు దంప‌తులు కిష‌న్ – చంద్ర‌క‌ళ సాగించిన రాస‌లీల‌ల య‌వ్వారానికి అమెరికా పోలీసులు చెక్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ లీల‌ల్లో ప‌లువురు క‌థానాయిక‌లు, యాంక‌ర్ల పేర్లు బ‌య‌ట‌ప‌డ‌డం పెను సంచ‌ల‌న‌మైంది. ప‌లువురిపై తీవ్ర ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇక‌పోతే అమెరికా రాస‌లీల‌ల్ని ఏమాత్రం ఖండించ‌ని కొంద‌రు నాయిక‌లు అక్క‌డ జ‌రిగేదంతా వాస్త‌వ‌మేన‌ని ప‌దే ప‌దే టీవీ చానెళ్ల లైవ్‌లో చెబుతుండ‌డం సంచ‌ల‌న‌మైంది. ఇందులో భాగంగా ప‌లువురు క‌థానాయిక‌ల్ని, యాంక‌ర్ల‌ను టీవీ చానెళ్లు ప్ర‌శ్నిస్తే వీళ్ల‌నుంచి షాకిచ్చే నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ముఖ్యంగా బెంగ‌ళూరు బ్యూటీ సంజ‌న‌, శ్రీ‌రెడ్డి, మెహ్రీన్ ఫీర్జ‌దా, యాంక‌ర్‌ అన‌సూయ, శ్రేష్ఠ వంటివారు ఓపెన్‌గా త‌మ‌కు జ‌రిగిన విష‌యాల్ని వెల్ల‌డించారు. అమెరికాలో ఈవెంట్ నిర్వాహ‌కుల లీల‌లు బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారు.

టాలీవుడ్ యువ‌క‌థానాయిక మెహ్రీన్ మాట్లాడుతూ .. అమెరికా ఇమ్మిగ్రేష‌న్ అధికారులు త‌న‌ను అర్థ‌గంట పాటు ఉక్కిరిబిక్కిరి చేశార‌ని, అయితే పోలీసులు ప్ర‌శ్నించాకే త‌న‌కు ఈ భోగోతం గురించి తెలిసింద‌ని మెహ్రీన్ తెలిపింది. తాను అమెరికాలో త‌ల్లిదండ్రుల్ని క‌లిసేందుకు వ‌చ్చాన‌ని చెప్ప‌డంతో, అమెరికా పోలీస్ సారీ చెప్పార‌ని వెల్ల‌డించింది. ఇక‌పోతే బెంగ‌ళూరు బ్యూటీ సంజ‌న ఏకంగా టాలీవుడ్, శాండ‌ల్వుడ్‌లోనే సీగ్రేడ్, డీగ్రేడ్ న‌టీమ‌ణులు అమెరికాలో ప‌డుపు వృత్తిలోకి వెళుతున్నార‌ని నివేదించ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈవెంట్ల మాటున అస‌లు భాగోతం వేరేగా సాగుతోంద‌ని సంజ‌న లైవ్‌లో తెలిపింది. యాంక‌ర్ అన‌సూయ సైతం త‌న‌ను కూడా రొంపిలోకి లాగేందుకు ప్ర‌య‌త్నించార‌ని, కానీ తాను ఇటీవ‌ల అమెరికా వెళ్ల‌లేద‌ని వెల్ల‌డించారు. 2014, 2016లో రెండుసార్లు దేవీశ్రీ ప్ర‌సాద్ లైవ్ షోల‌కు తాను అమెరికా వెళ్లాన‌ని ఆ త‌ర‌వాత అస‌లు అమెరికానే వెళ్లలేద‌ని అన‌సూయ వివ‌ర‌ణ ఇచ్చారు. ఇక‌పోతే శ్రీ‌రెడ్డి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ .. తెలుగు సినీప‌రిశ్ర‌మ అవ‌కాశాలివ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే అమెరికా వెళ్లి న‌టీమ‌ణులు ఇలాంటి ప‌నుల‌కు పాల్ప‌డుతున్నార‌ని అన‌డం క‌ల‌క‌లం రేపింది. మ‌హిళా లిరిసిస్ట్ శ్రేష్ఠ సైతం త‌న‌ను ఓ మ‌హిళా ద‌ర్శ‌కురాలు గోవా పార్టీకి పిలిచింద‌ని, ఇక్క‌డ అమ్మాయి అయితే చాలు చెరిచేందుకు ప్ర‌య‌త్నిస్తార‌ని టీవీ చానెళ్ల లైవ్‌లో వాపోయారు. మొత్తానికి ఈ డ‌ర్టిపిక్చ‌ర్ 2లో ప‌లువురు అబ‌ల‌లు వాపోవ‌డం జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో చ‌ర్చా వేదిక‌కు ఆస్కార‌మిచ్చింది. త్వ‌ర‌లోనే దీనిపై మా అసోసియేష‌న్ ఓ మీటింగ్ ఏర్పాటు చేయ‌నుందిట‌.

User Comments