బాద్షాహో.. అంటోన్న బాలీవుడ్ 

దక్షిణ భారతంలోనే కాకుండా.. ఉత్తర భారతంలో కూడా అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా బాహుబలి.  ఈ సినిమా విజయంతో బాలీవుడ్ కు కొత్త ఉత్సాహం వచ్చింది. బాలీవుడ్ లో బాహుబలి సినిమా తరువాత మరో పెద్ద హిట్ లేదు.  హిట్ కోసం బాలీవుడ్ పరితపించిపోతున్నది.  బాహుబలి తరువాత సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్, షారూఖ్ సినిమా విడుదలైన అవి విజయం సాధించలేదు.  అట్టర్ ప్లాప్ అయ్యాయి.  ఈ రెండు సినిమాలు వరసగా ఫ్లాప్ కావడంతో.. బాలీవుడ్ డీలా పడింది. తప్పకుండా హిట్ అవుతుంది అనుకున్న ట్యూబ్ లైట్ వెలవెలపోవడంతో భారీ నష్టాలు మూటకట్టుకుంది.  ఇక, షారుక్ ఖాన్ సినిమా మొదటి రోజు కలెక్షన్లు దారునంగా ఉన్నాయి.
అంత తక్కువ కలెక్షన్లను తామేప్పుడు చూడలేదని..బాలీవుడ్ క్రిటిక్స్ చెప్తున్నాయి.  షారూఖ్ ఖాన్ సినిమా అంటే మినిమిమ్ ఫస్ట్ డే కలెక్షన్లు అద్బుతంగా ఉంటాయి.  గత సినిమాలతో పోల్చుకుంటే.. ఈ సినిమా కలెక్షన్లు నిల్ అని చెప్పొచ్చు. ఇకపోతే, ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులు మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కలెక్షన్లు తక్కువగా ఉన్నా సరే.. మంచి సినిమా అయితే చాలు అనుకుంటున్న సమయంలో అజయ్ దేవ్ గన్ నటించిన బాద్షాహో సినిమా ట్రైలర్ విడుదలైంది.  ఈ ట్రైలర్ అద్బుతంగా ఉందని కామెంట్లు వస్తున్నాయి.  యూట్యూబ్ లో ఈ ట్రైలర్ దూసుకుపోతున్నది.  ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని బాలీవుడ్ ప్రేక్షకులు అనుకుంటున్నారు.  మరి అంచనాలు అందుకుంటుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.