ట్రైల‌ర్: ఒణుకు పుట్టిస్తున్న‌ దెయ్యం

Last Updated on by

హార‌ర్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ కి ఆద్యం `మిర్ర‌ర్స్‌`. హాలీవుడ్‌లో ప్ర‌భంజ‌నం సృష్టించిన ఈ సినిమా ఇప్ప‌టికీ బుల్లితెర‌పై టాప్ టీఆర్‌పీ మూవీ. `మిర్ర‌ర్స్‌`లో ఉప‌యోగించిన సౌండ్ టెక్నాల‌జీ, రీరికార్డింగ్  ఒక్కసారి సినిమా చూసిన‌వారికి ప‌దే ప‌దే క‌ళ్ల‌లో క‌నిపిస్తూ చెవుల్లో రింగుమంటూనే ఉంటుంది. మిర్ర‌ర్స్‌కి ముందు, మిర్ర‌ర్స్‌కి త‌ర‌వాత కూడా ఎన్నో గొప్ప హార‌ర్ చిత్రాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజయ్యాయి. ఆ క్ర‌మంలోనే ఇండియాలోనూ గొప్ప హార‌ర్ చిత్రాల మేకింగ్ కొన‌సాగింది.

తెలుగులో అయితే హార‌ర్ సినిమాల‌కు ఫెయిల్యూర్ అన్న‌దే లేదు. మినిమం గ్యారెంటీ జోన‌ర్‌గా ఈ త‌ర‌హా చిత్రాలు వెలిగిపోతున్నాయి. ప్రేమ‌క‌థా చిత్రం, కాంచ‌న, గంగ‌, రాజుగారి గ‌ది, ఆనందో బ్ర‌హ్మ .. ఇలా బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలెన్నో వ‌చ్చాయి. వీట‌న్నిటికంటే వైవిధ్యంగా పిజ్జా, పిజ్జా 2 చిత్రాలు సైన్స్ బేస్డ్‌లో వ‌చ్చి ఆక‌ట్టుకున్నాయి. అయితే అదే జోన‌ర్‌లో వ‌స్తున్న హిందీ సినిమా `ది పాస్ట్‌` మిస్టీరియ‌స్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా అద‌ర‌గొట్టేయ‌బోతోంది. ఆ విష‌యం ఈ ట్రైల‌ర్ చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. దెయ్యం, ఆత్మ ఆవ‌హించ‌డం అన్న పాయింట్ రొటీన్‌గానే ఉన్నా, సౌండ్ -ఆర్‌.ఆర్ ప‌రంగా మై ఎండ్ లో భీక‌రంగా క‌నిపిస్తోంది. కామ‌న్ ఆడియెన్‌ని భ‌య‌పెట్ట‌గ‌లిగితే హిట్టు ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మే. అయితే మునుముందు వ‌చ్చే హార‌ర్ సినిమాలు ఈ త‌ర‌హా పాయింట్‌తో కాకుండా, ఊహాతీతం అనిపించే కాన్సెప్టుల‌తో తీయాల్సి ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. అప్‌డేట్ అవుతున్న ఆడియెన్‌తో పాటు కొత్త‌ద‌నం చాలా ఇంపార్టెంట్.

User Comments