#RRR గిరిజ‌న వీరుడి ఫిక్ష‌న్ ల‌వ్

NTR Fans Disappointed with Olivia Morris in RRR

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ క‌థానాయ‌కులుగా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి రూపొందిస్తున్న ఆర్.ఆర్.ఆర్ 2020 జూలై 30న రిలీజ్ కానుంది. డెడ్ లైన్ ప్ర‌కారం రిలీజ్ చేసేందుకు ఆర్‌ఆర్‌ఆర్ చిత్రీక‌ర‌ణ‌ను వేగంగా పూర్తి చేస్తోంది చిత్ర‌బృందం. చ‌ర‌ణ్-ఆలియా.. తార‌క్- ఒలీవియా మోరిస్ జంట‌ల‌పై కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ చేయనున్నారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ -ఒలివియా జంట మ‌ధ్య రొమాంటిక్ సీన్స్ ని ప్ర‌స్తుతం తెరకెక్కిస్తున్నార‌ని స‌మాచారం. తార‌క్ తో ఒలివియా కెమిస్ట్రీ అద్భుతంగా పండుతోంద‌ట‌.

తెల్ల‌మ్మాయితో ప్రేమ‌లో ప‌డే గిరిజ‌న వీరుడు కొమ‌రం భీమ్ గా తార‌క్ న‌టిస్తున్నార‌. ఈ పాత్ర కోసం తార‌క్ త‌న రూపాన్ని మార్చుకున్నారు. ప్ర‌ఖ్యాత ఫిట్ నెస్ ట్రైన‌ర్ లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సముద్రఖని ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై దాదాపు న‌300 కోట్ల బ‌డ్జెట్ తో దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మ‌ర‌క‌మ‌త‌మ‌ణి ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.