అమెరికాలో త్రిష వ‌రుడు?

Last Updated on by

అందాల త్రిష‌లోని విల‌క్ష‌ణత‌ ప్ర‌తిసారీ హాట్ టాపిక్‌. కెరీర్ ఆరంభంలో తాగి వీధుల్లో ర‌చ్చ చేయ‌డం అన్న యాంగిల్‌ని బ‌య‌ట‌పెట్టింది త్రిష‌. అదంతా కుర్ర‌త‌నం, అల్ల‌రిత‌నం అని స‌రిపెట్టుకున్నారంతా. ఆ క్ర‌మంలోనే పెటా స‌భ్యురాలిగా మూగ జీవాల్ని సంర‌క్షించే మ‌న‌సున్న నాయిక‌గా పేరు తెచ్చుకుంది. త‌న‌లో అదో న్యూ యాంగిల్‌. ఊహించ‌ని రీతిలో వ్య‌క్తిగత జీవితంలో కొన్ని క‌ల‌త‌లు త్రిష‌ను బాగా ఇబ్బంది పెట్టాయి. అలా అని నిండా బాధ‌ల్లో మునిగిపోయి ముక్కు చీదుకుంటూ కూచోలేదు. ప్ర‌తి ఫెయిల్యూర్ త‌ర‌వాత స‌క్సెస్ ఉంటుంద‌ని నిరూపిస్తూ వ‌రుస సినిమాల‌తో బిజీ అయిపోయింది.

ప్ర‌స్తుతం త్రిష పాత‌ క‌మిట్‌మెంట్లు పూర్తి చేసి, విదేశీ విహారాల్లో బిజీగా ఉంది. ఆ క్ర‌మంలోనే త్రిష అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది. గ‌త రెండు వారాలుగా స్కాట్లాండ్‌లోనూ షికార్లు చేసింది. అదంతా స‌రే.. ఈ అమ్మ‌డు ప‌నిలో ప‌నిగా
అమెరికాలో వ‌రుడిని వెతుక్కుంద‌ని ముచ్చ‌ట వినిపిస్తోంది. తొంద‌ర్లోనే ఆ యువ‌కుడిని పెళ్లాడేస్తుంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. త్రిష క‌జిన్స్ అమెరికాలో గ‌త కొంత‌కాలంగా సంబంధాలు చూస్తున్నార‌ని, ఇక పెళ్లి భాజా మోగే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని చెబుతున్నారు. ఈ చెన్న‌య్ చంద్రం న‌టించిన `శ‌తురంగ వేట్టై 2` త్వ‌ర‌లో రిలీజ్ కానుంది.

User Comments