త్రిష‌కు పెళ్లంట‌.. న‌మ్మొచ్చా..?

Last Updated on by

సీనియ‌ర్ హీరోయిన్ త్రిష పెళ్లి కూతురు కాబోతుంది. ఇందులో నిజం ఎంతుందో తెలియ‌దు కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం మాత్రం ఈ సారి క‌చ్చితంగా త్రిష పెళ్లి చేసుకోబోతుంద‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌లిపి 5 సినిమాల్లో న‌టిస్తుంది. ఇందులో 3 ఇప్ప‌టికే పూర్త‌య్యాయి కూడా. కొన్ని విడుద‌ల‌కు నోచుకోవ‌డం లేదు. ఇదిలా ఉంటే ఈ మ‌ధ్యే వ‌ర‌ల్డ్ టూర్ పూర్తి చేసుకుని రెండు నెల‌ల త‌ర్వాత ఇండియాకు వ‌చ్చింది త్రిష‌. ఇక ఇప్పుడు మ‌రోసారి అమెరికా వెళ్ల‌బోతుంది ఈ ముద్దుగుమ్మ‌. దానికి కార‌ణం మాత్రం ఏ సినిమా షూటింగ్ కాదు.. త‌న షూటింగ్ కోసం. అంటే పెళ్లి కోస‌మే అన్న‌మాట‌.

అమెరికాలో ఉన్న ఓ బిజినెస్ మ్యాన్ ను త్రిష పెళ్లాడ‌బోతుంద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే ఈ సంబంధంపై ఇరు కుటుంబాలు కూడా సుముఖంగా ఉన్నాయ‌ని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే ఓ సారి త్రిష పెళ్లి క్యాన్సిల్ అయింది. అప్ప‌ట్లో చెన్నై బిజినెస్ మ్యాన్ వ‌రుణ్ మ‌ణియ‌న్ తో నిశ్చితార్థం చేసుకుని మ‌రీ క్యాన్సిల్ చేసుకుంది త్రిష‌. ఆ త‌ర్వాత వ‌ర‌స‌గా సినిమాలు చేసింది. మ‌ళ్లీ ఇన్నేళ్ళ‌కు పెళ్లి మాటెత్తింది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి ఈ సారేం జ‌ర‌గ‌బోతుందో..!

User Comments