ప్రేమ‌లో ప‌డిన త్రిష‌

Last Updated on by

15 ఏళ్ల సీనియారిటీ అందాల త్రిష సొంతం. 35 వ‌య‌సులోనూ టీనేజీ గాళ్ త‌ర‌హాలో ఎంతో యాక్టివ్‌గా న‌టిస్తూ మెప్పిస్తోంది. దేశ‌ విదేశాల్లో వెకేషన్స్‌, సెల‌బ్రేష‌న్స్ అంటూ షికార్లు చేస్తూ నిరంత‌రం సామాజిక మాధ్య‌మాల్లో ఫోటోల్ని పోస్ట్ చేస్తోంది. ఇదివ‌ర‌కూ ఈ భామ అమెరికాలో ఒక బిజినెస్‌మేన్‌తో ప్రేమ‌లో ప‌డింద‌న్న ప్ర‌చారం సాగింది. అయితే దానికి ఆధారాల్లేక‌పోయినా.. తాజాగా మరోసారి ఈ ప్రేమ నిజమేనంటూ ఓ వార్త వేడెక్కిస్తోంది. సామాజిక మాధ్య‌మాల్లో తన ఫోటోలతో స‌హా ఎ టేబుల్ ఫర్ టూ అంటూ ట్వీట్ పెట్టడంతో త్రిష ప్రేమ‌లో ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని నెటిజ‌నులు ట్వీట్‌ల‌తో చెల‌రేగిపోయారు.

చెన్నయ్‌ బిజినెస్‌మేన్ కం నిర్మాత వరుణ్ మణియన్ తో త్రిష నిశ్చితార్థం పూర్త‌వ్వ‌డం, అటుపై అనూహ్య ంగా పెళ్లి క్యాన్సిల్ అవ్వ‌డం తెలిసిందే. ఈ ఘ‌ట‌న త‌ర్వాతా త్రిష ఏమాత్రం స్పీడ్ త‌గ్గ‌కుండా వ‌రుస‌గా సినిమాల్లో న‌టించింది. క‌న్న‌డ‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తెలుగులోనూ క‌థ‌లు వింటోంద‌న్న స‌మాచారం ఉంది. ఇక‌పోతే త‌ను ప్రేమ‌లో ఉన్న వ్య‌క్తిని తొంద‌ర్లోనే పెళ్లాడేయ‌బోతోంద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు న్యూయార్క్‌లో యునిసెఫ్ కార్య‌క్ర‌మాల‌తోనూ త్రిష బిజీగా ఉంది. ప్రస్తుతం మోహిని – గర్జన, 96 చతురంగవేట్టై – 2 చిత్రాల‌లో త్రిష న‌టిస్తోంది.

User Comments