Last Updated on by
ఏంటి లెక్క అనుకుంటున్నారా..? ఒకే వారం ముగ్గురు హీరోయిన్లు మూడు ఇండస్ట్రీలకు పరిచయం అయ్యారు. వాళ్లు నటించిన సినిమాలు ఒకే సారి విడుదలయ్యాయి. ముందుగా తెలుగు ఇండస్ట్రీ తీసుకుంటే.. ఈ వారం వచ్చిన సినిమాల్లో ఛలోకు సూపర్ టాక్ వచ్చేసింది. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంతోనే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది రష్మిక మండన్న . కన్నడనాట ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా వెలిగి పోతున్న ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా మాయ చేస్తుంది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ప్లస్ సొంత డబ్బింగ్ తో రష్మిక అందరిని తన మాయలో పడేసింది.
ఇక తమిళ ఇండస్ట్రీకి మన తెలుగు హీరోయిన్ పరిచయమైంది. ఆమె నిహారిక కొణిదెల. విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరో సినిమాతో ఆమె తమిళ్ కు వెళ్లింది. అక్కడ ఆమె నటించిన ఒరు నల్లనాల్ పాత్తు సొల్రెన్ సినిమా ఫిబ్రవరి 2న విడుదలైంది. ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. చూస్తుంటే ఈ చిత్రం నిహారిక డ్రీమ్ డెబ్యూ అయ్యేలా లేదు. విజయ్ సేతుపతి ఇమేజ్ తో ఓపెనింగ్స్ వరకు ఓకే కానీ ఆ తర్వాత మాత్రం సినిమా నిలబడేలా కనిపించట్లేదు.
ఇక మళయాల ఇండస్ట్రీకి త్రిష అడుగు పెట్టింది. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లైనా ఇప్పటి వరకు మళయాలం లో ఒక్క సినిమా కూడా నటించలేదు త్రిష. ఇన్నేళ్ళ తర్వాత నివిన్ పాలీతో కలిసి హే జ్యూడ్ సినిమా చేసింది త్రిష. ఫిబ్రవరి 2నే ఈ చిత్రం విడుదల అయింది. దీనికి యావరేజ్ టాకే వచ్చింది. త్రిష నటన గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు. స్టార్ పెయిర్ ఓకే కానీ అందులో కంటెంట్ లేదని తేల్చేసారు ప్రేక్షకులు. మొత్తానికి తెలుగులో రష్మిక సూపర్ హిట్.. తమిళ, మళయాల ఇండస్ట్రీల్లో నిహారిక, త్రిష మాత్రం ఆకట్టుకోలేదు.
User Comments