త్రిష‌కు షాక్ ఇచ్చిన ఐశ్వ‌ర్యా..

Last Updated on by

త్రిష అంటే పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.. ఇక ఇక్క‌డ ఐశ్వ‌ర్యా అంటే రాయ్ కాదు.. రాజేష్. ఈ భామ‌తో మాత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. ఒక‌ప్పుడు తెలుగులో హీరోగా న‌టించిన రాజేష్ కూతురే ఈ ముద్దుగుమ్మ‌. తెలుగ‌మ్మాయి అయినా కూడా త‌మిళ్ లోనే సెటిలైంది ఐశ్వ‌ర్యా రాజేష్. ఇప్పుడు అక్క‌డ వ‌ర‌స సినిమాల‌తో ర‌చ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇన్నాళ్లూ చిన్న సినిమాల‌తో స‌ర్దుకున్నా కూడా ఇప్పుడు స్టార్ ద‌ర్శ‌కులు.. హీరోలు ఈ భామే కావాలంటున్నారు. ప్ర‌స్తుతం విక్ర‌మ్ ధృవ‌న‌క్ష‌త్రంతో పాటు మ‌ణిర‌త్నం న‌వాబ్ సినిమాల్లో న‌టిస్తుంది ఐశ్వ‌ర్య రాజేష్. దాంతో పాటు మ‌రో రెండు సినిమాల్లోనూ న‌టిస్తుంది. ఇవ‌న్నీ ఇలా ఉండ‌గానే ఇప్పుడు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కూడా ఐశ్వ‌ర్య చేతికి వ‌చ్చింది.

విక్ర‌మ్ హీరోగా మాస్ డైరెక్ట‌ర్ హ‌రి తెర‌కెక్కిస్తోన్న సామి స్క్వేర్ లో ఓ హీరోయిన్ గా ఎంపికైంది ఈ ముద్దుగుమ్మ‌. త్రిష పోషించాల్సిన పాత్ర‌లో ఇప్పుడు ఐష్ రీ ప్లేస్ చేసింది. 15 ఏళ్ల కింద వ‌చ్చిన సామిలో త్రిషే హీరోయిన్. దాంతో ఆ భామ‌నే మ‌రో హీరోయిన్ గా కొన‌సాగించాడు హ‌రి. ఇదే సినిమాలో కీర్తిసురేష్ మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తుంది. అయితే ద‌ర్శ‌కుడితో విబేధాల కార‌ణంగా త్రిష ఈ సినిమా నుంచి బ‌య‌టికి వ‌చ్చింది. ఇప్పుడు ఈ స్థానంలోకి ఐశ్వ‌ర్య రాజేష్ ను తీసుకున్నాడు హ‌రి. మెల్ల‌గా ఈ తెలుగ‌మ్మాయి త‌మిళ్ లో స్టార్ హీరోయిన్ హోదా వైపు అడుగులు వేస్తూనే ఉంది. అయితే అక్క‌డ అంత స‌త్తా చూపిస్తున్నా తెలుగులో మాత్రం ఐష్ ను ప‌ట్టించుకోక‌పోవ‌డం విడ్డూరం.

User Comments