త్రివిక్రమ్ క్లూ.. ఎన్టీఆర్తోనే తర్వాత!

అల్లు అర్జున్తో `అల వైకుంఠపురములో` తీశాడు త్రివిక్రమ్. ఆదివారమే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆ సినిమా ప్రచారంలో భాగంగా మీడియా ముందుకు వెళుతున్న త్రివిక్రమ్కి ఇప్పుడు ఎదురవుతున్న పెద్ద ప్రశ్న. తర్వాత సినిమా ఎవరితో అనేది! దానికి త్రివిక్రమ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు, కథ సిద్ధం చేసుకున్నానే అని చెబుతూ వస్తున్నాడు. శుక్రవారం ప్రింట్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా త్రివిక్రమ్ ఇదే ప్రశ్న ఎదురైంది. చిరంజీవితో సినిమా గురించి అడగ్గా ఆయన వెంటనే `అదింకా కన్ఫర్మ్ కాలేదు` అని బదులిచ్చాడు.

ఎన్టీఆర్తో సినిమా చేస్తారట కదా అని అడిగినప్పుడు మాత్రం ఆయన “అఫీషియల్ కన్షర్మేషన్తో వస్తాం“ అని చెప్పుకొచ్చాడు. దీన్నిబట్టి ఆయన ఎన్టీఆర్తో సినిమా చేయడానికే సిద్ధంగా ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ క్లూని బట్టి మీడియా ఎన్టీఆర్తోనే త్రివిక్రమ్ చేయబోతున్నారని ఓ అభిప్రాయానికొచ్చింది. ఎన్టీఆర్ కూడా `ఆర్.ఆర్.ఆర్` మినహా కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. త్రివిక్రమ్తో పక్కా అయినందుకే ఆయన కొత్త సినిమాల గురించి ఆలోచించలేదని సమాచారం. `ఆర్.ఆర్.ఆర్`లో ఎన్టీఆర్తోపాటే నటిస్తున్న రామ్చరణ్ మాత్రం తన తండ్రి నటిస్తున్న కొత్త చిత్రంలో కీలక పాత్ర చేయబోతున్నాడట. అందుకోసం డేట్లు కూడా కేటాయించేశాడు. ఇక త్రివిక్రమ్ ఫ్రీ అయిపోయారు కాబట్టి ఎన్టీఆర్ కొత్త సినిమా కూడా పక్కా అయ్యే అవకాశాలున్నాయి.