త్రివిక్ర‌మ్ కొత్త సినిమా అదేనా?

విజ‌యాల బాట ప‌ట్టేశాడు త్రివిక్ర‌మ్‌. ఇక జోరు పెంచ‌డ‌మే ఆల‌స్యం అన్న‌ట్టుగా క‌నిపిస్తున్నాయి ఆయన ప్ర‌ణాళిక‌లు. మొన్న `అర‌వింద స‌మేత‌`, నిన్న `అల‌.. వైకుంఠ‌పుర‌ములో`. ఈ రెండూ మంచి విజ‌యాల్నే అందుకున్నాయి. `అజ్ఞాత‌వాసి` ప్ర‌భావం నుంచి ఇక ఆయ‌న పూర్తిగా బ‌య‌టికొచ్చేసిన‌ట్టే. ఇక ఈ ఉత్సాహంలో మ‌రింత జోరు పెంచేలా క‌నిపిస్తున్నాడు త్రివిక్ర‌మ్‌. త‌ర్వాత సినిమా గురించి ఆయ‌న ఇప్ప‌టిదాకా ఏమీ ప్ర‌క‌టించ‌లేదు కానీ, స్కెచ్ మాత్రం సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం. త్రివిక్ర‌మ్ త‌దుప‌రి చేయ‌నున్న సినిమాల్లో క‌థానాయ‌కులంటూ ప్ర‌భాస్ మొద‌లుకొని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఎన్టీఆర్ , రామ్‌చ‌ర‌ణ్ త‌దిత‌రుల పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి. మ‌రి ఎవ‌రు ఫైనల్ అవుతార‌నే విష‌యంలో క్లారిటీ రావాలంటే మాత్రం ఇంకొంచెం స‌మ‌యం ప‌ట్టేలా క‌నిపిస్తోంది. పేరు మాత్రం ప్ర‌చారంలోకి వ‌చ్చింది. `అయిన‌నూ పోయిరావలె హ‌స్తిన‌కి` అనే పేరుతో త్రివిక్ర‌మ్ కొత్త సినిమాని తెరకెక్కించ‌బోతున్నార‌ని స‌మాచారం. విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఓ సోష‌ల్ ఎలిమెంట్ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కానీ, రామ్‌చ‌ర‌ణ్ కానీ న‌టించే అవ‌కాశాలున్న‌ట్టు తెలుస్తోంది. నిజానికి త్రివిక్ర‌మ్ ఇప్పుడు చిరంజీవితో సినిమా చేయాలి. కానీ చిరు వేరే చిత్రంతో బిజీ అయిపోయారు. అందుకే త్రివిక్ర‌మ్ త‌క్ష‌ణ‌మే యంగ్ హీరోల్లో ఒక‌రితో సినిమా పూర్తి చేసే ప‌నిలో ప‌డిపోయారు.