పవన్ ఓకే.. కానీ త్రివిక్రమ్ భయపడుతున్నాడు

Last Updated on by

అదేంటి.. త్రివిక్ర‌మ్ ఎందుకు భ‌యం అనుకుంటున్నారా..? ఏమో ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఇలాగే అనిపిస్తుంది మ‌రి. ఈయ‌న నిజంగానే భ‌య‌ప‌డుతున్నాడేమో అనిపిస్తుంది. మొన్న‌టికి మొన్న ఈయ‌న ఛ‌ల్ మోహ‌న్ రంగా ప్రీ రిలీజ్ వేడుక‌కు రాక‌పోవ‌డానికి కార‌ణం కూడా ఇదే అని తెలుస్తుంది. ఆ సినిమాకు నిర్మాతే కాకుండా క‌థ కూడా అందించాడు మాట‌ల మాంత్రికుడు. అలాంటిది ఆ సినిమా వేడుక‌కు త్రివిక్ర‌మ్ రాక‌పోవ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌మే. పైగా నితిన్ తో ఆయ‌న‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. అన్నింటికి మించి త్రివిక్ర‌మ్ ఆప్త‌మిత్రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ వేడుక‌కు వ‌చ్చాడు. ఇన్ని జ‌రిగినా కూడా త్రివిక్ర‌మ్ మాత్రం రాలేదు. దానికి కార‌ణం అజ్ఞాత‌వాసి ఫ్లాప్.

అజ్ఞాత‌వాసి సినిమా త‌ర్వాత ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ మ‌ధ్య కాస్త గ్యాప్ వ‌చ్చింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి కానీ అందులో ఎలాంటి నిజం లేద‌ని.. కాక‌పోతే అంత పెద్ద డిజాస్ట‌ర్ ఇచ్చిన త‌ర్వాత ప్రేక్ష‌కుల్ని ఫేస్ చేయ‌డం త్రివిక్ర‌మ్ వ‌ల్ల కావ‌డం లేద‌ని చెబుతున్నారు స‌న్నిహితులు. అందుకే ఓ హిట్ కొట్టిన త‌ర్వాత ధైర్యంగా ప్రేక్ష‌కుల ముందుకొస్తాన‌ని చెబుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అందుకే క‌దా.. అజ్ఞాత‌వాసి ఫ్లాప్ త‌ర్వాత ఎక్క‌డా సీన్ లో కూడా క‌నిపించ‌లేదు త్రివిక్ర‌మ్. ప‌వ‌న్ అయినా ధైర్యంగా వ‌స్తున్నాడు కానీ త్రివిక్ర‌మ్ మాత్రం భ‌య‌ప‌డుతూనే ఉన్నాడు. అంతేలెండి.. చేసే ప‌నిపై ఖచ్చితంగా భ‌యం ఉండాల్సిందే. ఆ క‌సితోనైనా ఎన్టీఆర్ కు బ్లాక్ బ‌స్ట‌ర్ ఇస్తాడేమో..! ఏప్రిల్ 12న ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. ఇదే ఏడాది సినిమా విడుద‌ల కానుంది.

User Comments