తెర‌స దెబ్బ‌కు భ‌య‌ప‌డుతున్నారా?

Last Updated on by

ఏదైనా అధికారం చేతిలో ఉంటేనే. అది లేన‌ప్పుడు పులి అయినా పిల్లిలా అణ‌గిమ‌ణిగి ఉండాలి. తోక జాడిస్తామంటే కుద‌ర‌దు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ఫిలింవ‌ర్గాలు స‌హా ధ‌నికుల ప‌రిస్థితి అలానే ఉంద‌ని తెలుస్తోంది. హైద‌రాబాద్ మీడియా క్లోజ్ అనాలిసిస్ ప్ర‌కారం… ఒక‌ప్పుడు హైద‌రాబాద్ ఇన్ సైడ్ కానీ… లేదా ఔట్ స్క‌ర్ట్స్.. ఔట‌ర్ రింగ్ రోడ్ ప‌రిస‌రాల్లో భారీగా భూములు కొనుక్కున్న పెద్ద‌లంతా ఇప్పుడు అమ్మ‌కాల బాట ప‌ట్టారన్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ – తెలంగాణ డివైడ్ అనంత‌రం ప్ర‌ధానంగా తెరాస ప్ర‌భుత్వం భూముల స్క్రుటినీ చేసింది. ఈ స్క్రుటినీలో ఆంధ్రుల‌కే బోలెడ‌న్ని చోట్ల భూములున్నాయ‌ని తేలింది. కొన్ని ఆక్ర‌మ‌ణ‌ల్ని తొల‌గించారు. చెరువుల్ని- కుంట‌ల్ని ఆక్ర‌మించుకున్న వారిని త‌రిమేశారు. రెగ్యుల‌రైజేష‌న్ పేరుతో య‌జ‌మానుల‌కు చుక్క‌లు చూపించారు. అయ్య‌ప్ప సొసైటీ.. ఎన్- క‌న్వెన్ష‌న్ స‌హా ప్ర‌తి చోటా జ‌రిగిందేంటో తెలిసిందే. కింగ్ నాగార్జున అంత‌టి వారే తెరాస ముందు మోక‌రిల్లాల్సొచ్చింద‌న్న‌ది వాస్త‌వం. అన్న‌పూర్ణ ఏడెక‌రాల ప‌రిస‌రాల్లో మెట్రో లైన్ దృష్టిలో పెట్టుకుని కొన్ని స‌ర్ధుబాట్లు చేశారు అప్ప‌ట్లో.
తాజా స‌మాచారం ప్ర‌కారం… హైద‌రాబాద్ నాన‌క్ రామ్ గూడ స‌హా ఔట‌ర్ రింగ్ రోడ్ ప‌రిస‌రాల్లో సినిమా వోళ్ల భూముల‌న్నిటినీ రియ‌ల్ వెంచ‌ర్లు వేయ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అయితే ఈ ఏరియా అత్యంత వేగంగా డెవ‌ల‌ప్ అవ్వ‌డంతో ఇక్క‌డ పెద్ద రేంజులో బిజినెస్ సాగుతోంది. ఎక‌రాల్లో కొనుక్కున్న వాళ్లంతా రియ‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ పేరుతో భారీగానే ఆర్జిస్తున్నారు. ఓ ప్ర‌ముఖ స్టార్ హీరోకు ఇక్క‌డ కొన్ని ఎక‌రాల్లో ఫామ్ హౌస్ ఉండేది. ఇప్పుడు ఆ ఇంటి ప‌రిస‌రాలు త‌ప్ప మిగ‌తాది అంతా ప్ర‌ఖ్యాత డెవ‌ల‌ప‌ర్స్ కంపెనీకి అప్ప‌జెప్పార‌ని ఇందులో వంద కోట్లు పైగా బిజినెస్ సాగుతోంద‌ని చెబుతున్నారు. అలాగే ముర‌ళిమోహ‌న్ కి చెందిన జ‌య‌భేరి సంస్థ‌కు ఔట‌ర్ రింగ్ రోడ్ ప‌రిస‌రాల్లో బోలెడ‌న్ని భూములున్నాయి. అవ‌న్నీ వంద‌ల వేల కోట్ల రియ‌ల్ బిజినెస్ సాగిస్తున్నార‌ని తెలిసింది. ఇక హైద‌రాబాద్ ఔట్ స్క్ర‌ర్ట్స్ లో మ‌న స్టార్లు.. సూప‌ర్ స్టార్లు ఎక‌రాల్లో భూములు కొన‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అయితే అవ‌న్నీ ప్ర‌స్తుతం రియ‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ పేరుతో వంద‌ల‌కోట్ల బిజినెస్ సాగిస్తున్నాయ‌ట‌.