ఏపీకి టాలీవుడ్ జంప్‌

Last Updated on by

టాలీవుడ్ హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ లేదా విశాఖ న‌గ‌రానికి త‌ర‌లి వెళుతోందా? గ‌త నాలుగేళ్లుగా క్వ‌శ్చ‌న్ మార్క్ ఇది. అయితే ఇన్నాళ్లు టాలీవుడ్ త‌ర‌లింపు విష‌య‌మై అంత ఉబ‌లాటం క‌నిపించ‌క‌పోయినా, మునుముందు ఈ ప్ర‌క్రియ త‌ప్ప‌నిస‌రి అని తాజా చ‌ర్య‌లు చెబుతున్నాయి. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మైండ్‌లో ఎప్పుడో పాదుకున్న విత్తు వృక్ష‌మ‌వుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే రాజధాని నిర్మాణంలో త‌ల‌మున‌క‌లుగా ఉండ‌డం, ఇత‌ర‌త్రా ఒత్తిళ్ల వ‌ల్ల వెంట‌నే ఫిలింఇండ‌స్ట్రీ త‌ల‌రింపు హ‌డావుడి చేయ‌డం లేద‌ని బాబు స‌న్నిహితులు కొంద‌రు చెబుతున్నారు.

ఇక‌పోతే ఇప్ప‌టికే ఎఫ్‌డీసీ, ఫిలించాంబ‌ర్ విజ‌య‌వాడ‌లో యాక్టివ్‌గా వ‌ర్క్ చేస్తున్నాయి. ఏవైనా డిస్ట్రిబ్యూట‌ర్ మీటింగులు కానీ, లేదా ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల మీటింగులు కానీ అటువైపే జోరుగా సాగుతున్నాయి. హైద‌రాబాద్‌లో ఫిలింఛాంబ‌ర్ నామ్ కే వాస్తే యాక్టివిటీస్ కే ప‌రిమితం అవుతోంద‌న్న మాటా ఛాంబ‌ర్ వాసుల్లోనే వినిపిస్తోంది. అంటే తొంద‌ర్లోనే ఏపీ నిర్మాత‌లంతా అటువైపు జంప్ జిలానీ..అవుతున్నారా? అంటే అది వెంట‌నే అని చెప్ప‌లేక‌పోయినా నెమ్మ‌దిగా అదే జ‌ర‌గ‌బోతోంద‌ని సంకేతాలు అందుతున్నాయి. ఇక‌పోతే ఏపీలో సినీ ప‌ర్యాట‌కం వృద్ధికి కృషి చేస్తాన‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే ప్ర‌క‌టిస్తున్నారు. అంబికా కృష్ణ కు ఆ బాధ్య‌త‌ల్ని అప్ప‌జెప్పారు. ఈ అంకంలో భాగంగా మ‌రో స్టెప్ వేసిన‌ట్టే క‌నిపిస్తోంది. తాజాగా ఏపీలో టీవీ& ఫిలిం ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు స‌న్నాహాలు చేస్తున్నామ‌ని సినీటూరిజం అభివృద్ధిలో భాగంగా తీసుకున్న నిర్ణ‌య‌మిద‌ని చంద్ర‌బాబు నిన్న‌టిరోజున బాల‌య్య‌తో స‌మావేశం సంద‌ర్భంగా అన‌డం చ‌ర్చ‌కొచ్చింది. అయితే ప్ర‌తిసారీ ఏదో ఒక ప్ర‌క‌ట‌న చేసి గాలికి వ‌దిలేయ‌డం కాకుండా ఇది నిజం కావాల‌న్న‌ది ఆ ప్రాంత వాసుల ఆకాంక్ష‌. మ‌రి ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటూ పూణే త‌ర‌హా ఫిలింఇనిస్టిట్యూట్‌ని బాల‌య్య‌- చంద్ర‌బాబు బృందం విశాఖ లేదా విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేస్తున్నారా? అన్న‌ది వాళ్లే ప్రాక్టిక‌ల్‌గా చెప్పాల్సి ఉందింకా.
అలా చేస్తే ప్ర‌వచించిన‌ట్టు అటువైపు ఉపాధి పెంచిన దేవుళ్లు అవుతారు వీళ్లు!!

User Comments