మెగా ఫ్యామిలీ నుంచి మ‌రో హీరోయిన్

అవునా.. ఇప్ప‌టికే నిహారిక వ‌చ్చేసింది క‌దా.. ఇంకా ఆ ఫ్యామిలీలో హీరోయిన్ గా ఎవ‌రు వ‌స్తున్నారు అనుకుంటున్నారా..? ఒక్క‌సారి ఉపాస‌న‌ను చూడండి.. చూసిన త‌ర్వాత కూడా ఇదే మాట అనండి చూద్దాం..! ఏ హీరోయిన్ ముందు కూడా ఇప్పుడు ఉపాస‌న తీసిపోదు. ఆమెను అప్ప‌ట్లో చూసి న‌వ్వుకున్న వాళ్ల‌కు ఇప్పుడు చెంప చెళ్లుమ‌నేలా మారిపోయి చూపించింది మెగా కోడ‌లు. లైఫ్ లో ఎవ‌రు దేన్ని హ‌ర్ట్ చేసినా ఓకే కానీ ఇగోను మాత్రం హ‌ర్ట్ చేయ‌కూడ‌దు.. ట‌చ్ చేయ‌కూడ‌దు. అలా చాలా మంది చాలాసార్లు ఉపాస‌న ఇగోను హ‌ర్ట్ చేసారు. అప్ప‌ట్లో ఆమె ఫిజిక్ పై కూడా కామెంట్ చేసిన వాళ్లు లేక‌పోలేదు. అన్నింటిని మౌనంగానే భ‌రించింది ఉపాస‌న‌. ఏ రోజు కూడా ఎప్పుడూ నోరు మెద‌ప‌లేదు. కానీ దానికి ప్ర‌తీకారం ఇప్పుడు త‌న రూపంతో తీర్చుకుంటుంది మెగా కోడ‌లు. అస‌లు మ‌నం చూస్తున్న‌ది ఉపాస‌ననేనా కాదా అనే అనుమానం వ‌చ్చేంత‌గా ఇప్పుడు కొత్త‌గా ద‌ర్శ‌నం ఇచ్చింది చ‌ర‌ణ్ భార్య‌.

Upasana Kamineni Ram Charan Fitness Motivation

ఉపాస‌నకు మ‌నం ఇప్పుడు చూస్తోన్న రూపం రావ‌డానికి చాలా అంటే చాలా క‌ష్ట‌ప‌డింది. రెండేళ్లుగా జిమ్ లో క‌ష్ట‌ప‌డింది.. చెమ‌ట‌లు చిందించింది. త‌ను భ‌ర్తకు ఇన్స్ స్పిరేష‌న్ అయిందో.. లేదంటే ధృవ కోసం చ‌ర‌ణ్ క‌ష్ట‌ప‌డుతున్న తీరు చూసి తానే ఇన్ స్పైర్ అయిందో తెలియ‌దు కానీ పూర్తిగా త‌న రూపాన్ని అయితే ఇప్పుడు మార్చేసుకుంది ఉపాస‌న‌. అస‌లు ఈమెను స‌డ‌న్ గా చూస్తే దీపిక ప‌దుకొనే అనుకున్నారంతా. దూరంగా చూడ్డానికి కూడా రూపం అలాగే మారిపోయింది ఈ కామినేని వార‌మ్మాయి. ఒక‌రికి ఒక‌రు అన్న‌ట్లుగా ఓ వైపు చ‌ర‌ణ్.. మ‌రోవైపు ఉపాస‌న త‌మ‌ను తాము మార్చుకున్న తీరు చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. ఈ మెగా దంప‌తుల డైట్ ప్లాన్ చూసినా కూడా క‌ళ్లు బైర్లు గ‌మ్మేస్తాయి. ముఖ్యంగా ఉపాస‌న అయితే ఉపాసన క్లీన్ వీక్ పేరుతో వారం రోజుల పాటూ కేవలం ఆకుకూరలు.. బఠానీలు.. దోసకాయలు.. క్యారెట్లు.. ప‌చ్చి కూర‌గాయ‌లు మాత్రమే తినింది. ఆ వీక్ పూర్తవ్వడంతో ట్విట్టర్ లో త‌న‌ ఫోటోను పోస్టు చేసింది. ఆ ఫోటోలో ఉపాసనను చూసి కొత్త హీరోయిన్ అనుకున్నారు కొందరు. మొత్తానికి విమ‌ర్శించిన నోళ్ల‌తోనే ఇప్పుడు పొగ‌డ్తలు అందుకుంటుంది ఉపాస‌న‌.

Upasana Kamineni Ram Charan Fitness Motivation

User Comments