మెగా కోడలు ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో తన ఫ్యాన్ మూవ్ మెంట్ ఫోటోని ట్విట్టర్ ద్వారా ఉపాసన షేర్ చేశారు. ఈ భూమిని, ప్రజల్ని కాపాడుతున్న వారు నిజమైన స్ఫూర్తి! అంటూ ఆనందం వ్యక్తం చేయడమే గాక.. ఇండియన్ ఫిలాంత్రపి ఇనిషియేటివ్ (ఐపీఐ) కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటో ఫ్యాన్స్ లోకి వైరల్ గా మారింది. ఇక ఉపాసన ఎంటర్ ప్రెన్యూర్ క్వాలిటీస్ గురించి పరిచయం అవసరం లేదు. అందుకే ఇలా ఒక గొప్ప ఎంటర్ ప్రెన్యూర్ ని కలిసిన సందర్భాన్ని షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ కి ఆనందాన్నిచ్చింది.
ప్రస్తుతం ఉపాసన తమ అపోలో సంస్థల్లోని ఉద్యోగాల కోసం యువతరం నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ప్రతి బుధవారం ఉద్యోగ సమాచారం అందిస్తున్నారు. తమ సంస్థ కోసం గ్రాఫిక్ డిజైనర్లు కావాలని ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. ఏడాది ప్రొఫెషనల్ అనుభవం ఉండి, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్ స్కిల్స్ ఉన్న వారికి మంచి అవకాశం అని తెలిపారు. బీఏ ఫైన్ ఆర్ట్స్ లేదా డిజిటల్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్ అనుభవం ఉండాలి. భాషపై మంచి చాతుర్యం ఉండాలని, అర్హతలు ఉన్నవారు upasana@apollolife.com కు రెస్యూమ్, సర్టిఫికెట్ కాపీలు, పోర్ట్ఫోలియో, చేతి రాత ఫోటో తీసి పంపాలని కోరారు.