ఎన్‌కౌంట‌ర్‌పై ఉపేంద్ర గ‌రంగ‌రం

దిశ ఘ‌ట‌న‌పై నిందితులు న‌లుగురిని ఎన్ కౌంట‌ర్ చేసిన నేప‌థ్యంలో ఆరంభంలో అంతా ప్ర‌శంసించారు.  కానీ ఇప్పుడిప్పుడే ఘ‌ట‌న‌పై విమ‌ర్శ‌లు అదే స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు నిజంగా వాళ్ల‌పై దాడి చేస్తేనే ఎన్ కౌంట‌ర్ చేసారా?  లేక చ‌ట్టాన్నే చుట్టంలా భావించి చేతుల్లోకి తీసుకున్నారా? అని  కొంత మంది క్రిమిన‌ల్ లాయ‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సీన్ రీ క‌న్ స్ట్ర‌క్ష‌న్ అంటూ పెద్ద డ్రామా ఆడార‌ని, స‌రైన సాక్షాలు సంపాదించ‌డంలోనూ, ఎఫ్.ఐ.ఆర్ ఇన్ టైమ్ లో ఫైల్ చేయ‌డంలో విఫ‌ల‌మ‌వ్వ‌డంతోనే ఆ న‌లుగుర్ని ఎన్ కౌట‌ర్ చేసిన‌ట్లు  కొంత మంది అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.

చేసిన నేరం క్ష‌మించ‌రానిది అయినా చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకోవ‌డం స‌మంజ‌సం కాద‌ని మేథావి వ‌ర్గం భావిస్తోంది. దీనిపై మాన‌వ హ‌క్కుల క‌మీష‌న్ (ఎన్ హెచ్ ఆర్ సీ) కూడా తెలంగాణ పోలీసుల‌పై సీరియ‌స్ గానే ఉందని వినిపిస్తోంది. ఎన్ కౌంట‌ర్ తో ఇలాంటి నేరాలు జ‌ర‌గ‌కుండా ఉటాయ‌ని  గ్యారెంటీ  ఇవ్వ‌గ‌ల‌రా? అని చాలా మంది మ‌హిళ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. దీనిపై ఇప్ప‌టికే మంచు ల‌క్ష్మి, గుత్త‌జ్వాల‌, మ‌రికొంత మంది ప్ర‌ముఖులు గ‌ళం వినిపించారు. తాజాగా క‌న్న‌డ న‌టుడు ఉపేంద్ర త‌న‌దైన శైలిలో స్పందించాడు. ఈ న‌లుగురు ఆమెను హ‌త్యాచారం చేసి కాల్చేసారో?  లేదో. ఈ ఘ‌ట‌న వెనుక ప్ర‌ముఖుల హ‌స్తం ఉందేమో? ఇదే త‌ర‌హా ఎన్ కౌంట‌ర్లు ప్ర‌ముఖ వ్య‌క్తుల కేసుల్లో ఎందుకు జ‌ర‌గ‌వో? పోలీసుల‌పై పూల వ‌ర్షం కురిపించిన వాళ్లు?  మిఠాయిలు పంచుకున్న వాళ్లంతా ఈ విష‌యాలు కూడా ఆలోచిస్తే ఓ అర్ధం ఉంటుంద‌ని?  సీరియ‌స్ అయ్యారు.