పిక్ టాక్‌: మ‌త్తెక్కే అందాల పందేరం

Last Updated on by

ముంబైలో నిన్న సాయంత్రం ప్ర‌తిష్ఠాత్మ‌క ఫిలింఫేర్ అవార్డుల ఉత్స‌వం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ ఉత్స‌వాల్లో బాలీవుడ్ అందాల నాయిక‌ల సంద‌డి ఓ రేంజులో సాగింది. వేడుక ఆద్యంతం కింగ్ ఖాన్ షారూక్ స‌హా భామామ‌ణుల విలాపం ఆక‌ట్టుకుంది. రేఖ‌, ప్రీతిజింతా, బిపాస బ‌సు, శిల్పాశెట్టి, సోనాక్షి, సోన‌మ్ వంటి అంద‌గ‌త్తెలు వేదిక‌పై త‌ళాంగు త‌ళుకులు ప్ర‌ద‌ర్శించారు. వీళ్ల‌తో పాటే కుర్ర బ్యూటీ జాన్వీ క‌పూర్ ఓ స్పెష‌ల్ డిజైన‌ర్ లుక్ తో మైమ‌రిపించింది.

ఈ వేదిక వ‌ద్ద హేట్ స్టోరి 4 బ్యూటీ ఊర్వ‌శి రౌతేలా స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ మ‌తి చెడగొట్టింది. పెద్ద తెర‌పై రెచ్చిపోయి న‌టించిన ఈ బుల్లితెర న‌టి, ఇలాంటి వేడుక‌ల వేళ ఏ రేంజులో చెల‌రేగిపోతోందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. తాజాగా ఫిలింఫేర్ 2019 ఉత్స‌వాల్లో ఊర్వ‌శి అంద‌చందాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ముఖ్యంగా ఈ భామ వేదిక వ‌ద్ద ఏ ఇత‌ర క‌థానాయిక క‌నిపించ‌నంత సెక్స‌ప్పీల్ తో మైమ‌రిపించింది. పై ఎద సౌంద‌ర్యాన్ని బిగువుల మ‌త్తును కుర్ర‌కారుపై చ‌ల్ల‌డంలో ఈ బ్యూటీ ఇచ్చిన ట్రీట్ మ‌ర్చిపోలేనిది. ఊర్వ‌శి స్పీడ్ చూస్తుంటే ఈ అమ్మ‌డికి మునుముందు ఉత్త‌రాది ప‌రిశ్ర‌మ‌తో పాటు, ఇటు సౌత్ లోనూ భారీగా అవ‌కాశాలు వెల్లువెత్త‌డం ఖాయం అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికైతే ఇదిగో ఇలా ఫోటో ట్రీట్ మీకోసం… ఇక‌మీద‌ట ఈ అమ్మ‌డిని హేట్ చేయ‌రంతే!!

User Comments