ఉయ్యాల‌వాడ బ‌డ్జెట్ ఎంతో తెలుసా?

uyyalavada narasimha reddy Shocking budget
తొమ్మిదేళ్ల త‌ర‌వాత రీ ఎంట్రీ ఇచ్చినా అద‌ర‌గొట్టేశాడు మెగాస్టార్‌. ఖైది నెం.150 సినిమాని సూప‌ర్ హిట్ చేయ‌డ‌మే కాకుండా, వంద కోట్ల సినిమాగానూ మ‌ల‌చి బాక్సాఫీసు ద‌గ్గ‌ర త‌న‌కు తిరుగులేద‌ని నిరూపించుకొన్నాడు. ఇప్పుడు అంద‌రి క‌ళ్లూ.. 151వ సినిమాగా వ‌స్తున్న ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిపైనే. ఇప్ప‌టికే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సివుంది. అయితే… స్క్రిప్టు విష‌యంలోనూ, న‌టీన‌టులు ఇత‌ర సాంకేతిన నిపుణుల విష‌యంలో చిత్ర‌బృందం చేస్తున్న క‌స‌ర‌త్తులు ముగియ‌క‌పోవ‌డంతో… ఆల‌స్యం అవుతోంది. అన్న‌ట్టు ఈ సినిమా కోసం ముందుగా రూ.100 కోట్ల బ‌డ్జెట్ కేటాయించారు. అయితే ఇప్పుడు ఆ బ‌డ్జెట్ మ‌రింత‌గా పెరిగింద‌ట‌. రూ.130 కోట్లు పెడితే… అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో సినిమాని రూపొందించొచ్చ‌ని ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. దానికి చిరు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్టు తెలుస్తోంది.
ఖైది నెం.150 దాదాపుగా రూ.150 కోట్లు తెచ్చుకొంది. బాహుబ‌లి త‌ర‌వాత అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన తెలుగు చిత్రం అదే. ఆ ధైర్యంతోనే ఉయ్యాల వాడ‌కు 130 కోట్లు పెట్ట‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌ట చిరంజీవి. ఇదే నిజ‌మైతే బాహుబ‌లి త‌ర‌వాత రెండో భారీ చిత్రం ఇదే!  తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.  హిందీ మార్కెట్ మీదున్న భ‌రోసాతోనే.. ఈ స్థాయిలో ఖ‌ర్చుపెట్టే ధైర్యం చేస్తున్నార‌ని వినికిడి.